For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్.. ప్రేమలో మునిగిపోతోన్న అంజలి

    |

    ఒక్క సినిమా చాలు ప్రేక్షకుల గుండెల్లో జీవిత కాలం పాటు నిలిచేందుకు. అంజలికి అలాంటి సినిమాలు బాగానే ఉన్నాయి. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే గత కొంత కాలం నుంచి తెలుగు ప్రేక్షకులకు దూరంగానే ఉంటోంది. ఆ మధ్య వచ్చిన గీతాంజలి సినిమాతో హిట్ కొట్టిన అంజలి మళ్లీ ఆ రేంజ్‌లో మెప్పించలేకపోయింది.

    ప్రస్తుతం అంజలి నిశ్శబ్దం, వకీల్ సాబ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగానే ఉంది. అందులో నిశ్శబ్దం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక వకీల్ సాబ్ చిత్రం కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పరిస్థితులన్నీ త్వరగా చక్కబడితే తెలుగు ప్రేక్షకులు అంజలిని మళ్లీ వెండితెరపై చూడొచ్చు. ఇక అంజలి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ మధ్య బర్త్ డే సందర్భంగా కొత్త లుక్, కొత్త హెయిర్ స్టైల్‌తో షాకిచ్చింది అంజలి.

     Anjali Fall In Love With Her Pet POLO

    జుట్టు కత్తిరించుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'ఏ మహిళ అయితే తన జుట్టును తాను కత్తిరించుకుంటుందో.. తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నట్టు. కోకో చానెల్ అంటూ పొట్టి జుట్టు అంటే ఇష్టం..అద్దెకు తెచ్చిన కళ్లద్దాలు'అని చెప్పుకొచ్చింది. తాజాగా తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమను అందరికీ తెలిసేలా చేసింది. నువ్ నా జీవితంలోకి వచ్చినందుకు, ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నందుకు థాంక్యూ పోలో అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

    English summary
    Anjali Fall In Love With Her Pet POLO. Thank you polo fr coming into my life n spreading so much love n happiness #polo #love #polodairies #internationaldogday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X