Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్.. ప్రేమలో మునిగిపోతోన్న అంజలి
ఒక్క సినిమా చాలు ప్రేక్షకుల గుండెల్లో జీవిత కాలం పాటు నిలిచేందుకు. అంజలికి అలాంటి సినిమాలు బాగానే ఉన్నాయి. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే గత కొంత కాలం నుంచి తెలుగు ప్రేక్షకులకు దూరంగానే ఉంటోంది. ఆ మధ్య వచ్చిన గీతాంజలి సినిమాతో హిట్ కొట్టిన అంజలి మళ్లీ ఆ రేంజ్లో మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం అంజలి నిశ్శబ్దం, వకీల్ సాబ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగానే ఉంది. అందులో నిశ్శబ్దం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక వకీల్ సాబ్ చిత్రం కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పరిస్థితులన్నీ త్వరగా చక్కబడితే తెలుగు ప్రేక్షకులు అంజలిని మళ్లీ వెండితెరపై చూడొచ్చు. ఇక అంజలి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ మధ్య బర్త్ డే సందర్భంగా కొత్త లుక్, కొత్త హెయిర్ స్టైల్‌తో షాకిచ్చింది అంజలి.
జుట్టు కత్తిరించుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'ఏ మహిళ అయితే తన జుట్టును తాను కత్తిరించుకుంటుందో.. తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నట్టు. కోకో చానెల్ అంటూ పొట్టి జుట్టు అంటే ఇష్టం..అద్దెకు తెచ్చిన కళ్లద్దాలు'అని చెప్పుకొచ్చింది. తాజాగా తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమను అందరికీ తెలిసేలా చేసింది. నువ్ నా జీవితంలోకి వచ్చినందుకు, ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నందుకు థాంక్యూ పోలో అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.