Anjali : పలుచటి చీరలో పైట పక్కకు జరిపి .. భారీ అందాలతో ఊరిస్తున్న రాజోలు పిల్ల
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లి కోలీవుడ్‌లో పాగా వేసిన అతికొద్దిమంది తెలుగు అమ్మాయిల్లో అంజలి ఒకరు. టాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఆమె తమిళంలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. నిన్న మొన్నటి వరకు సరైన ఆఫర్స్ లేక ఎలాగోలా నెట్టుకొచ్చిన అంజలి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఏకంగా పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్ పట్టేసి షాకిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజోలులో 16 జూన్ 1986న జన్మించారు అంజలి. ప్రాథమిక విద్యను స్థానికంగా పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత చెన్నైకి మకాం మార్చింది. అక్కడే మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో పలు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఇక్కడ వచ్చిన పాపులారిటీతో వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నించిన అంజలి అనుకున్నది సాధించారు.

2006లో నందూ హీరోగా తెలుగులో వచ్చిన ఫోటో అనే మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన అంజలి అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అయితే తెలుగులో అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. బొద్దుగా ఉండేవారిని ఇష్టపడే తమిళ తంబిలు అంజలిని బాగానే లైక్ చేశారు. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా అవతరించారు. తమిళ్‌లో బిజీగా ఉన్న సమయంలోనే మాతృభాష తెలుగుపై ఓ లుక్ వేశారు.
వెంకటేష్ - మహేశ్ బాబు హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీతగా హోమ్లీ లుక్‌లో అలరించారు అంజలి. ఈ దెబ్బతో తెలుగులో అవకాశాలు పోటెత్తాయి. బలుపు, మసాలా, గీతాంజలి, శంకరాభరణం, డిక్టేటర్, చిత్రాంగద, వకీల్ సాబ్, గీతాంలి మళ్లీ వచ్చింది వంటి సినిమాలు చేశారు. హీరోయిన్‌గా కాదు.. ఐటెం సాంగ్స్‌తోనూ మెప్పించారు అంజలి. సరైనోడులో అల్లు అర్జున్‌తో కలిసి బ్లాక్ బస్టర్ అనే సాంగ్‌లో నర్తించారు. తర్వాత మాచర్ల నియోజకవర్గంలో రారా రెడ్డి అంటూ ఆకట్టుకున్నారు.
రీసెంట్‌గా విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , బహిష్కరణ అనే సినిమాల్లో బోల్డ్ సీన్స్ , డైలాగ్స్‌తో షాకిచ్చారు అంజలి. ఎప్పుడూ హోమ్‌లీ లుక్‌లో పద్దతిగా కనిపించే ఆమె నోటివెంట బూతులు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సీన్స్ చేసేటప్పుడు తాను కూడా ఏడ్చానని అంజలి స్వయంగా చెప్పారు. కానీ ఛాలెంజింగ్ రోల్స్ పడినప్పుడే మనలోని నటి బయటికి వస్తుందని ఆమె అన్నారు. ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌లో అంజలి కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అంజలి తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఉల్లిపొర లాంటి వైట్ కలర్ సిల్క్ చీర కట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











