For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘F3’ మూవీపై ‘వకీల్ సాబ్’ ఎఫెక్ట్: రంగంలోకి తెలుగు హీరోయిన్.. హాట్ బ్యూటీకి షాకిచ్చిన యూనిట్

  |

  విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). కొన్నేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. కలెక్షన్ల పరంగానూ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ తీస్తున్నారు. ఇది ప్రకటించినప్పటి నుంచే ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రంలో హాట్ బ్యూటీ స్థానంలో తెలుగు హీరోయిన్ భాగం కాబోతుందని మరో న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో నవ్వులు పంచారు

  ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో నవ్వులు పంచారు

  సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం ‘F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు.

  సీక్వెల్‌తో మళ్లీ వస్తున్న సంక్రాంతి అల్లుళ్లు

  సీక్వెల్‌తో మళ్లీ వస్తున్న సంక్రాంతి అల్లుళ్లు

  ‘F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా ‘F3'ని రూపొందించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ‘F3' పేరిట ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా ప్రారంభించేశారు.

   ఈ సినిమా ఆ పాయింట్‌తో రాబోతుందట

  ఈ సినిమా ఆ పాయింట్‌తో రాబోతుందట

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు.

   సినిమాలో హైలైట్లు అవే... ప్రాబ్లంతో ఫన్

  సినిమాలో హైలైట్లు అవే... ప్రాబ్లంతో ఫన్

  ‘F2' మాదిరిగానే దానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘F3'ను కూడా మరింత ఫన్నీగా రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్. ఇందులో భాగంగానే హీరో వెంకటేష్‌కు రేచీకటి సమస్యను ఇందులో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సునీల్‌తో సరికొత్త ట్రాకును తీసుకొచ్చి నవ్వించబోతున్నాడట. అలాగే, ఓ హీరోయిన్‌ను కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

   ‘F3'లోకి హాట్ హీరోయిన్ వస్తుందంటూ

  ‘F3'లోకి హాట్ హీరోయిన్ వస్తుందంటూ

  ‘F3' మూవీలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్‌ కూడా నటిస్తుందని ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఓ పాత్ర కోసం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ కథను ఆమెకు వినిపించాడట దర్శకుడు అనిల్. అది ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. దీంతో చిత్రానికి మరింత గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపించింది.

  Tollywood : Vakeel Saab, Love Story మూవీస్ పైనే అందరి ఫోకస్ !
   ‘వకీల్ సాబ్' ఎఫెక్ట్: తెలుగు భామ ఎంట్రీ

  ‘వకీల్ సాబ్' ఎఫెక్ట్: తెలుగు భామ ఎంట్రీ

  తాజా సమాచారం ప్రకారం.. సోనాల్ చౌహాన్‌తో అనుకున్న పాత్ర కోసం తెలుగు బ్యూటీ అంజలిని రంగంలోకి దింపుతున్నాడట దిల్ రాజు. ‘వకీల్ సాబ్' మూవీలో ఆమె అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకోవడం వల్లే ‘F3' యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ రోల్ సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. అందుకే ఆమె ఓకే చెప్పిందని టాక్.

  English summary
  Daggubati Venkatesh, Varun Tej Movie F2 - Fun and Frustration. In This Movie Tamannaah, Mehrene Kaur Pirzada paired Them. Dil Raju Produced This Movie. And Anil Ravipudi Is The Director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X