ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. సీక్రెట్ స్టోరీ బయటపెట్టిన హీరోయిన్!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో అంజలి ఒకరు. ఎలాంటి గ్లామర్ హంగామా లేకుండానే తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఈ తెలుగు అమ్మాయి. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలు అందుకుంటుంది. తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎప్పుడూ గోప్యంగానే ఉంచారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్కూల్ రోజుల నుంచి ఇండస్ట్రీ వరకు తనకు ఎదురైన లవ్ ప్రపోజల్స్ గురించి చెప్పారు.

ఓ ఇంటర్వ్వూలో హీరోయిన్ అంజలి పాల్గొన్నారు. యాంకర్ "ప్రపోజ్ చేస్తే రాఖీ ఎందుకు కట్టారు?" అని ప్రశ్నించగా, "అది ఒక ఈగో డ్రైవ్’’ అన్నారు. 'కట్టి చూడు' అంటూ అతను నాకు ఛాలెంజ్ చేశాడు. నేనూ తగ్గకుండా నిజంగానే రాఖీ కట్టేశాను. అంతే" అన్నారు. తాను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే ఒక అబ్బాయి తనను ఇష్టపడేవాడని గుర్తు చేసుకున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిరంతరం తనకు ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడని చెప్పారు.

Anjali Reveals Funny Love Proposal Story

మొదట్లో పట్టించుకోకపోయినా.. చివరకు అతని పట్టుదల చూసి ఓ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. "పదో తరగతిలో అతనికి రాఖీ కట్టేశాను. ఇక ఆ తర్వాత నన్ను వదిలేస్తాడనుకున్నాను. కానీ అతను మాత్రం 'అన్నయ్య కాదు... కన్నయ్య' అంటూ రాఖీ తీసి పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతన్ని నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు" అంటూ నవ్వుతూ చెప్పారు.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా తనకు లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? అనే ప్రశ్నకు అంజలి ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. యాంకర్.. "ఒక హీరో మీకు ప్రపోజ్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది నిజమేనా?" అని అడగగా.. అంజలి వెంటనే, "ఈ మధ్యకాలం గురించి మాట్లాడుతున్నారా? లేక ఫ్లాష్‌బ్యాక్ గురించి మాట్లాడుతున్నారా?" అంటూ ఎదురుప్రశ్నించారు.

ఫ్లాష్‌బ్యాక్ గురించి చెప్పమనగా.. అంజలి నవ్వుతూ.."మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ముందుగా క్లారిటీ ఇవ్వండి. నేను ఒక పేరు చెబితే, మీరు ఇంకో పేరు చెబుతారు. అప్పుడు 'అంటే ఆ పేరు కూడా మీ లిస్ట్‌లో ఉందా?' అని నన్నే ఇబ్బంది పెడతారు. అందుకే నేను ఎలాంటి పేరు చెప్పను. ప్రస్తుతం అయితే నా జీవితంలో అలాంటి వ్యక్తి ఎవరూ లేరు" అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు.

అలాగే సినీ పరిశ్రమలో లవ్ ప్రపోజల్స్ చాలా కామన్ విషయమేనని అంజలి అన్నారు. ముఖ్యంగా షూటింగ్‌ల సమయంలో అభిమానులు, సహనటులు, పరిచయస్తుల నుంచి ఎమోషనల్‌గా ప్రపోజల్స్ వస్తుంటాయని, అయితే వాటిని తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని చెప్పారు. "ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ ప్రతి ప్రపోజల్ ప్రేమగా మారదు. చాలా వరకు అభిమానుల అభిమానం మాత్రమే ఉంటుంది" అని స్పష్టం చేశారు.

ఇక కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన రూమర్స్ మాత్రం తనను చాలా బాధపెట్టాయని అంజలి గుర్తు చేసుకున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో తన గురించి రాసిన వార్తలను నిజంగానే నమ్మి చాలా రోజులు బాధపడేదాన్నని, తర్వాత అవన్నీ రూమర్స్ మాత్రమేనని అర్థమైందని చెప్పారు. ఇప్పుడు మాత్రం అలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోనని తెలిపారు.

Read more about: love affairs tollywood anjali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X