మొదటిసారి ఆ తప్పు చేశాను.. బూతులతో ఆ క్యారెక్టర్.. అంజలి

అచ్ఛ తెలుగు అందం అంజలి గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటో అనే సినిమా ద్వారా అంజలి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించాలేకపోయింది దీంతో అంజలి షాపింగ్ మాల్ అనే తమిళ చిత్రం డబ్బింగ్ తో తెలుగు తెరకు మరోసారి పరిచయమైంది.మొదట అంజలిని చూసి అందరూ తమిళ్ అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆ సినిమా తరువాత ఆమె తెలుగు అమ్మాయి అని తెలిసి అవాక్కయ్యారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడం వరుస సినిమాలు తెలుగులో క్యూ కట్టాయి.

స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని ఆమె అందుకుంది. తెలుగు కంటే తమిళ్ లోనే ఆమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక హీరోయిన్ గా కాకుండా ఐటమ్ సాంగ్స్ చేస్తూ కూడా అంజలి మంచి పేరు తెచ్చుకుంది.సరైనోడు, మాచర్ల నియోజక వర్గం లాంటి సినిమాల్లో అంజలి స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం అంజలి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న గేమ్ చేంజర్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది..రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

Anjali says ratnamala is the power full women in gangs of godavari

ఇందులో చరణ్ డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. మొదటి హీరోయిన్ గా కీయారా నటిస్తుండగా.. రెండో హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అంజలి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు పారితోషికం కూడా అమాంతం పెంచేసింది కూడా.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు అంజలి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా మే 31 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

Anjali says ratnamala is the power full women in gangs of godavari

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అంజలి.. ఈ సినిమా కోసం బూతులు మాట్లాడినట్లు తెలిపింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో అంజలి రత్నమాల అనే పవర్ ఫుల్ పాత్రలో నటించింది. " ఈ పాత్ర కోసం లైఫ్ లో మొదటి సారి బూతులు మాట్లాడాను. నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా బూతులు మాట్లాడే క్యారెక్టర్ చేయలేదు. అలాగే బయట నా వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదు. కానీ ఈ మూవీలో రత్నమాల క్యారెక్టర్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించినపుడు ఆశ్చర్యం వేసింది. ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం నన్ను ఎలా ఏంచుకున్నారా అని అనుకున్నాను. కానీ, సినిమా చూసాక చాలా బావుంది అనిపించింది" అని అంజలి చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమాతో అంజలి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X