అది జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతీక.. కొత్త లుక్‌లో అంజలి
జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది అంజలి. ఆపై తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్‌కు మరింత దగ్గరైంది. అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరి సరసనా నటించింది. బాలకృష్ణ, వెంకటేష్ వంటివారితో నటించి మెప్పించింది. తాజాగా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోన్న వకీల్ సాబ్ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా మరో ప్రతిష్టాత్మక చిత్రంలోనూ నటించింది. అనుష్క శెట్టి, మాధవన్ కాంబోలో తెరకెక్కిన నిశ్శబ్దం చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్‌ను పోషించింది. సీబీఐ పాత్రలో అంజలి అదరగొట్టిందని టాక్. అయితే ఈ మధ్య జరిగిన అంజలి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా అంజలి తన కొత్త లుక్ గురించి చెప్పుకొచ్చింది.

తన జుట్టును తానే కట్ చేసుకున్నానని తెలిపింది. జుట్టు కత్తిరించుకుని చిన్న పిల్లలా మారిపోయింది. ఈ మేరకు ఫోటోలను షేర్ చేస్తూ.. 'ఏ మహిళ అయితే తన జుట్టును తాను కత్తిరించుకుంటుందో.. తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నట్టు. కోకో చానెల్ అంటూ పొట్టి జుట్టు అంటే ఇష్టం..అద్దెకు తెచ్చిన కళ్లద్దాలు'అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











