ఒక్క మసాజ్ కోసం ఇన్ని లక్షలా? అక్కినేని హీరోయిన్ స్పా బిల్లు వైరల్!
హీరోయిన్లు తమ అందాలను, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడతారు. కష్టమైన వర్కవుట్స్, డైటింగ్, మితంగా భోజనం, ఖరీదైన ప్రోటీన్ ఫుట్ లాంటివి తీసుకుంటారు. ఇక మరికొందరు శరీరంపై నల్లమచ్చలను, నల్లటి వలయాలను తొలిగించుకోవడానికి బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తారు. ఇవి కాకుండా ఖరీదైన ఫేస్‌క్రీమ్‌లు, ప్యాక్‌లు, కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఓ ప్రత్యేకమైన మసాజ్ కోసం లక్షల్లో ఖర్చు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఆ నటి ఎవరో కాదు.. అంజు కురియన్. కేరళలోని కొట్టాయానికి చెందిన ఈ ముద్దుగుమ్మ... మాతృభాష మలయాళంలోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అనుకున్న స్థాయిలో ఆమె క్లిక్ కాలేదు. కొన్నాళ్ల పాటు సెకండ్ లీడ్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన అంజు కురియన్ 2016లో వచ్చిన కవి ఉద్దేశిషత్తు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఓం శాంతి ఓషాన మూవీలో వినీత్ శ్రీనివాస్‌తో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. న్యాన్ ప్రకాశనిలో ఫహద్ ఫాజిల్, జాక్ డేనియల్‌లో దిలీప్ కుమార్ వంటి అగ్ర నటుల సరసన నటించింది.

ఈ ఫేమ్‌తోనే అంజు కురియన్‌కు తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా నటించిన ఇదం జగత్‌లో ఆయనకు జోడిగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. తన అందం, నటనతో తొలి సినిమాతోనే తెలుగులో మంచి మార్కులు కొట్టేసింది అంజు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేసింది. కొట్టాయంకు చెందిన రోషన్ జాకోబ్ కరిప్ప అనే బిజినెస్‌మెన్‌ని గతేడాది పెళ్లి చేసుకున్నారు అంజు. పెళ్లయినప్పటికీ నట జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.. గతేడాది ఓతో ఎంథన్ బేబీ, ఆదర్స్ అనే తమిళ చిత్రాలలో నటించింది అంజు కురియన్.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అంజు కురియన్.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం భారతదేశంలో ఎండలు మండిపోతుండటంతో అంజు కురియన్ .. ఇండోనేషియాలోని బాలీ ట్రిప్ వేశారు. అక్కడ ఓ సాంప్రదాయ జపనీస్ స్పాలో మసాజ్ చేయించుకుంటున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. దీనితో పాటు వీడియో చివరిలో స్పాల్ బిల్లు ఎంత అయ్యిందో చూపించారు. అందులో ఏకంగా 7.25 లక్షల రూపాయలు ఉండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం ఒక మసాజ్ కోసమే ఆమె ఏకంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇండియాలోని ఫేమస్ సెంటర్లలో ఎన్నో రకాల మసాజ్ ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు 5000 నుంచి 10000 మధ్య ఉంటాయి. అయితే విదేశాలలో లభించే మసాజ్‌లు మాత్రం కాస్త ఖరీదుగా ఉంటాయి. కానీ అంజు కురియన్ షేర్ చేసిన వీడియోలో తాను చేయించుకున్న జపనీస్ స్పా మసాజ్ కోసం ఏకంగా 7.25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లు చూపించింది. అయితే ఇక్కడే అంజు ట్విస్ట్ ఇచ్చింది. బాలీ కరెన్సీలో 7.25 లక్షల రూపాయలంటే.. భారత కరెన్సీలో 4 వేల రూపాయలు మాత్రమేనని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో అసలు విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications