ఆఫర్ ఇస్తా పడుకొంటావా? గదిలోకి పిలిచి దక్షిణాది స్టార్ హీరో దారుణంగా... సుశాంత్ మాజీ ప్రేయసికి చేదు అనుభవం

దక్షిణాది సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం మరోసారి బయటపడింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే దక్షిణాదిలో ఓ టాప్ హీరో నుంచి ఎదురైన అనుభవాన్ని పంచుకొన్నది. ఆ హీరో ఎవరు? ఆమెకు ఎదురైన సంఘటన ఏమిటనే వివరాల్లోకి వెళితే...

ఆఫర్ ఇస్తా.. కాంప్రమైజ్ అవుతావా?

ఆఫర్ ఇస్తా.. కాంప్రమైజ్ అవుతావా?

అకింతా లోఖండే ఆంగ్ల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దశలో అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. ఆ సమయంలో దక్షిణాది పరిశ్రమ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో నన్ను కంప్రమైజ్ అవుతావా అని అడిగారని అంకితా లోఖండే వెల్లడించింది.

అలాంటి పరిస్థితుల్లో చేదు అనుభవం

అలాంటి పరిస్థితుల్లో చేదు అనుభవం

మొదటి నుంచి నేను మానసికంగా బలమైన వ్యక్తిత్వం కలిగినదానిని. నన్ను అదోలా చూస్తే నేను సహించే దానిని కాను. ఎదుటి వారిని హద్దుల్లో ఉంచేందుకు ప్రయత్నించే దానిని. వయసులో చిన్నదానిని, ఇంకా మానసికంగా అలాంటి పరిస్థితుల్లో నాకు అలాంటి అనుభవం ఎదురైంది అని అంకితా లోఖండే తెలిపింది.

గదిలోకి పిలిచి హీరో అలాంటి నిర్వాకం

గదిలోకి పిలిచి హీరో అలాంటి నిర్వాకం


దక్షిణాదికి చెందిన టాప్ హీరో నన్ను గదిలోకి పిలిచి.. అంకితా నిన్ను ఓ విషయం అడగదలచుకొన్నాను. నీవు కంప్రమైజ్ కావాల్సి ఉంటుందని చెప్పాడు. ఆయన ప్రశ్నకు తెలివిగా నేను సమాధానం ఇస్తూ.. మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్ కావాలంట? అని అడిగాను. నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను అని అంకితా లోఖండే చెప్పింది.

ఆఫర్ రాదని అప్పుడే అర్ధమైంది..

ఆఫర్ రాదని అప్పుడే అర్ధమైంది..


హిందీలో పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా నేను ప్రేక్షకాదరణను పొందిన తర్వాత ఇలాంటి ఘటన ఎదురైంది. ఆ హీరోతో మాట్లాడిన తర్వాత షెక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాను. ఆ హీరో పేరు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. అతను టాప్ హీరో. ఆ హీరో నిర్వాకం చూసి వెంటనే గది నుంచి బయటవచ్చాను. ఈ సినిమా ఆఫర్ ఇక రాదు అని అప్పుడే నాకు అర్ధమైంది అని అంకితా లోఖండే పేర్కొన్నది.

అంకితా లోఖండే కెరీర్ గురించి

అంకితా లోఖండే కెరీర్ గురించి


ఇక అంకితా లోఖండే నటిగా కాకుండా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసిగానే ఎక్కువ ప్రజాదరణ పొందింది. హిందీలో మణికర్ణిక, భాగీ 3 చిత్రాల్లో నటించింది. హిందీ టెలివిజన్ రంగంలో పవిత్ర రిస్తా, కామెడీ సర్కస్, సప్నే సుహానే లడక్‌పన్ కే, ఏక్ థి నాయక, శక్తి: అస్థిత్తవ కే ఎహసాస్ కీ, బిగ్‌బాస్ 13 ద్వారా ఎక్కువగా పాపులారిటీని సాధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X