‘నిర్మాతతో పడుకొంటావా? సినిమాలో ఆఫర్ ఇస్తాం’

హిందీ టెలివిజన్‌ రంగంలో స్టార్ యాక్టర్లలో ఒకరైన అంకిత లోఖండే సంచలన విషయాలు బయటపెట్టింది. సౌత్ ఇండియాలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది. యాంకర్ సిద్దార్థ్ ఆలంబయాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 19 ఏళ్ల వయసులో తనకు లభించిన తొలి సినిమా ఆఫర్ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరంగా చెప్పింది. తాను ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి? టెలివిజన్ రంగంలోనే ఎందుకు సెటిల్ కావాలని అనుకొన్నది? అనే వివరాలు చెప్పింది. సిద్దార్థ్ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

క్యాస్టింగ్ కౌచ్ అనుభవం నాకు ఎదురైంది. ముంబైలో ఓ సౌత్ సినిమా కోసం ఆడిషన్ జరిగింది. ఆడిషన్‌లో వారు సంతృప్తి చెందారు. అయితే అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్లాల్సి ఉంది. అదే విషయాన్ని మా అమ్మతో చెబితే.. అంత తర్వగా సినిమా ఆఫర్ వచ్చిందా? అనే అనుమానం వ్యక్తం చేసింది. నా అదృష్టం కొద్ది సినిమా అవకాశం వచ్చిందని నేను అనుకొన్నాను. అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్లాను అని అంకితా లోఖండే తెలిపింది.

Ankita Lokhande

అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్తే నా కోఆర్టినేటర్‌ను బయట కూర్చొబెట్టారు. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు మాత్రమే. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత నిర్మాతకు సంబంధించిన వ్యక్తి నాతో మాట్లాడుతూ.. నీవు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అని అడిగాడు. అయితే అవతలి వ్యక్తి నుంచి ఫుల్లుగా క్లారిటీ తీసుకొనేందుకు.. నిర్మాతతో నేను ఏమైనా పార్టీలకు వెళ్లాలా? ఫైనాన్షియర్‌తో పార్టీకి వెళ్లాలా? అని నేను కొంత స్మార్ట్‌గా అడిగాను. దాంతో ఆ వ్యక్తి పూర్తిగా ఓపెన్ అయ్యాడు. నీవు ప్రొడ్యూసర్‌తో పడుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు అని ఆమె వెల్లడించింది.

ఆఫర్ కోసం ఇలాంటి ఆఫరిస్తామని చెప్పిన అతడి మనసులోని మాట బయటకు రాగానే.. వెంటనే నేను అక్కడి నుంచి లేచాను. లేచి ఆయనకు ఓ మాట చెప్పాను. ఆఫర్ కోసం నిర్మాతతో పడుకొనే అమ్మాయిని కాదు. నేను అలాంటి వాటికి లొంగను. టాలెంట్‌ను నమ్ముకొని ఉన్నాను అని ముఖం మీదే చెప్పాను. దాంతో మీరు అలా అనుకోవద్దు. ప్రామిస్ నేను ఈ సినిమాలో ఆఫర్ ఇస్తాను అని అతడు తగ్గాడు. దాంతో మీరు ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చినా నేను చేయను. నాకు ఈ సినిమా అవసరం లేదు అని చెప్పి బయటకు వచ్చాను ఆమె చెప్పారు.

అలాంటి అనుభవం తర్వాత ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాను. అవకాశాల కోసం పడక గదిని షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాపై అలాంటి హక్కు ఎవరికి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఆఫర్ కోసం ఎవరూ కూడా నిర్మాతతో పడుకొంటావా? అనే ప్రశ్న నా వద్దకు రావొద్దని డిసైడ్ అయ్యాను. అలాంటి మాటలు వింటే.. నాకు నేను చాలా కుంగిపోతాను అని అంకిత లోఖండే అంది.

ఆ రోజు జరిగిన అనుభవంతో నేను ఇక ముందు సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకొన్నాను. ఏది ఏమైనా టెలివిజన్ ఇండస్ట్రీలోనే ఉండాలని అనుకొన్నాను. ఆ తర్వాత వచ్చిన అవకాశమే పవిత్ర రిస్తా సీరియల్. నేను ఆ సీరియల్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను అని అంకిత తెలిపింది.

అంకిత లోఖండే కెరీర్, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. స్వర్గీయ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలిగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. పవిత్ర రిస్తా సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఝలక్ దిక్లాజా, కామెడీ సర్కస్ కా నయా దౌర్, ఏ థి నాయికా, స్మార్ట్ జోడి, బిగ్ బాస్ 17 ద్వారా మరింత పాపులారిటి సంపాదించారు. బాలీవుడ్‌లో కంగన రనౌత్‌తో కలిసి మణికర్ణిక, భాగీ 3, స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాల్లో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X