Sushant Singh Rajput మాజీ ప్రేయసి పెళ్లి.. అంకిత లోఖండే భర్త ఎవరు? ఆయన ఆస్తుల విలువ ఎంతంటే?

జాతీయ స్థాయిలో బుల్లితెర మీద అత్యంత పాపులారిటిని సంపాదించుకొన్న పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా ఇంటింటికి సుపరిచితులైన అంకితా లోఖండే వివాహం చేసుకొన్నారు. కొద్దికాలంగా ప్రేమలో ఉంటూ డేటింగ్ చేసున్న అంకిత.. తన ప్రియుడు, వ్యాపారవేత్త వికీ జైన్‌ను ముంబైలో పెళ్లి చేసుకొన్నారు. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఇద్దరు సెలబ్రిటీల పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, టెలివిజన్ రంగానికి చెందిన సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు హాజరయ్యారు. అంకితా లోఖండే వ్యక్తిగత జీవితం విషయాల్లోకి వెళితే..

 సుశాంత్‌తో అంకిత లోఖండే బ్రేకప్

సుశాంత్‌తో అంకిత లోఖండే బ్రేకప్

పవిత్ర రిస్తా సీరియల్‌లో నటిస్తుండే సమయంలో తన సహచర నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేశారు. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారని భావించిన వారికి సుశాంత్, అంకిత లోఖండే షాకిచ్చారు. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత కొద్ది నెలలకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది.

 నాలుగేళ్లుగా వికీ జైన్‌తో డేటింగ్

నాలుగేళ్లుగా వికీ జైన్‌తో డేటింగ్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో బ్రేకప్ తర్వాత ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికీ జైన్‌తో ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్లుగా వారిద్దరూ డేటింగ్ చేస్తూ వచ్చారు. వాస్తవానికి గతేడాది వారిద్దరి పెళ్లి జరుగాల్సింది. కానీ కోవిడ్ కారణంగా వారి వివాహం వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడంతో డిసెంబర్ 14వ తేదీన ముంబైలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.

 సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు, వీడియో

సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు, వీడియో

మంగళవారం ఉదయం మహారాష్ట్ర వివాహ సంప్రదాయాల ప్రకారం అంకిత లోఖండే, వికీ జైన్ వివాహం జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య వికీ జైన్, అంకిత లోఖండే పూలదండలు మార్చుకొన్నారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లహెంగా, జాకెట్‌ను ధరించి అందంగా ముస్తాబయ్యింది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్‌గా మారాయి.

కాలికి గాయమైనా జోష్‌గా అంకితా

కాలికి గాయమైనా జోష్‌గా అంకితా

అంకితా లోఖండే పెళ్లికి కొద్ది రోజుల ముందు కాలికి గాయమైంది. అయితే కాలి నొప్పిని లెక్క చేయకుండా పెళ్లికి ముందు జరిగిన పలు రకాల వేడుకల్లో ఉత్సాహం పాల్గొన్నారు. ప్రతీ ఈవెంట్‌లో జోష్‌తో డ్యాన్స్ చేశారు అని సన్నిహితులు చెప్పారు. అంకిత లోఖండే వివాహానికి హిందీ టెలివిజన్ తారలు పవిత్ర పునియా, ఇజాజ్ ఖాన్, అపర్ణా దీక్షిత్, అమృతా ఖాన్‌విల్కర్ తదితరులు హాజరయ్యారు.

వికీ జైన్ ఎవరు? ఆయన ఆస్తులు విలువ ఎంతంటే?

వికీ జైన్ ఎవరు? ఆయన ఆస్తులు విలువ ఎంతంటే?

అయితే అంకితా లోఖండే ప్రియుడు వికీ జైన్ వ్యక్తిగత జీవితంలోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన వాడు. బొగ్గు వ్యాపారంలో కొనసాగుతున్నారు. బిలాస్‌పూర్‌లోని మహావీర్ కోల్ వాషెరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా 2008లో నియమితులయ్యారు. రాయ్‌పూర్‌లోని త్రివేణి డెంటల్ కాలేజ్‌లో భాగస్వామిగా, బాకస్ క్రికెట్ లీగ్‌లో ముంబై టైగర్స్‌కు సహ భాగస్వామిగా ఉన్నారు. వికీ జైన్ నికర ఆస్తి రూ.38 కోట్లుగా అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X