twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకు న్యాయం జరగదు పాయల్.. నన్ను కూడా అలానే వేధించారు: అన్నమయ్య హీరోయిన్

    |

    చాలా రోజుల తరువాత మళ్ళీ మీటూ ఉద్యమం వేడెక్కేలా కనిపిస్తోంది. హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలతో ఒక్కసారిగా బాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. చాలా మంది హీరోయిన్స్ వారికి ఎదురైన చేదు అనుభవల గురించి బయటపెడుతున్నారు. ఇక అన్నమ్మయ్య హీరోయిన్ కస్తూరి శంకర్ కూడా పాయల్ ఆరోపణలపై స్పందిస్తూ తనకి ఎదురైన చేదు అనుభవం గురించి కూడా బయటపెట్టింది.

    బ్లూ ఫిలిమ్స్ చూపించి..

    బ్లూ ఫిలిమ్స్ చూపించి..

    హీరోయిన్ పాయల్ ఘోష్ ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బ్లూ ఫిలిమ్స్ చూపించి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నం చేశాడని అలాగే బెదిరించాడని కూడా ఆమె ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఆ విషయం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమెకు కంగనా రనౌత్ తో పాటు మరికొందరు సీనియర్ హీరోయిన్స్ మద్దతపలుకుతున్నారు.

     ఆ ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

    ఆ ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

    ఇక మరికొందరు అనురాగ్ కశ్యప్ కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే అన్నమ్మయ్య హీరోయిన్ కస్తూరి శంకర్ ఈ వివాదంపై ఎవరు ఊహించని విధంగా స్పంధించారు. పాయల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. దాని వల్ల నష్టమే గాని పెద్దగా ఉపయోగం కూడా లేదని సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    నీకు ఏ న్యాయం జరగదు

    నీకు ఏ న్యాయం జరగదు

    కస్తూరి స్పందిస్తూ.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నువ్వు చేసిన ఆరోపణలు న్యాయస్థానం ముందు నిలబడవు. నేరాన్ని రుజువు చేయలేని సాక్షాధారలు లేనప్పుడు లైంగిక ఆరోపణలు చేస్తే ఏం లాభం. ఈ విషయంలో నీకు ఏ న్యాయం జరగదు. పైగా ఈ ఆరోపణల కారణంగా మీ ఇద్దరిలో ఎవరో ఒకరి కెరీర్ నాశనమయ్యే అవకాశముంది.. అంటూ కస్తూరి కామెంట్ చేశారు.

    నన్ను కూడా వేదించారు

    నన్ను కూడా వేదించారు

    ఇక సోషల్ మీడియాలో కస్తూరి స్పందించిన తీరుకు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆమె కామెంట్స్ పై స్పందించిన ఒక నెటిజన్.. ఇలాంటి పరిస్థితే మీకు గాని, మీ కుటుంబ సభ్యులకు గాని ఎదురైతే ఇలానే మాట్లాడతారా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కస్తూరి.. నా ఫ్యామిలిలో ఏంటి? నేనే చాలా సార్లు ఆ విధంగా లైంగిక వేధింపులను చూశాను, నన్ను కూడా చాలా రకాలుగా వేదించారు. ఒక విధంగా నేను కూడా బాధితురాలినే.. అంటూ కస్తూరి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

    English summary
    In the film industry a lot of heroines come in a year as well as suddenly disappear. However, there are very few heroines who will be remembered for a long time with a single movie. Kasturi is one of such people. Kasturi, who shared the screen with Ramyakrishna and Nagarjuna in the film Annamayya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X