బిగ్ బాస్ మోసం: ఏడాది గడిచినా ఇంకా డబ్బులు ఇవ్వలేదు: అన్నమయ్య నటి

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటి కస్తూరి శంకర్ పేరు ఇటీవల బాగా వైరల్ అవుతోంది. అన్నమయ్య సినిమాతో కస్తూరి తెలుగు ప్రేక్షకుకు బాగా దగ్గరయ్యింది. ఇక ఇటీవల ఆమె చేస్తున్న కామెంట్స్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సాదారణ విషయాలతో పాటు వివాదాస్పదంగా మరే విషయాలపై కూడా కస్తూరి పవర్ఫుల్ ట్వీట్స్ వేస్తోంది. ఇక రీసెంట్ బిగ్ బాస్ షో పై ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

 బిగ్ బాస్ నిర్వకాహాకుల మోసం

బిగ్ బాస్ నిర్వకాహాకుల మోసం

తెలుగులో సింపుల్ గా మొదలైన బిగ్ బాస్ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. హిందీ బిగ్ బాస్ షో కూడా త్వరలో స్టార్ కాబోతోంది. ఇక తమిళ్ లో మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ నాలుగవ సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నరు. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫిక్స్ అయినట్లు కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి సమయంలో కస్తూరి శంకర్ బిగ్ బాస్ నిర్వకాహాకులు మోసం చేసినట్లు ఆరోపించింది.

ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

గత ఎడాది తమిళ్ బిగ్ బాస్ మూడవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కస్తూరి కాంట్రవర్సీ గోడవలతో షోకి మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. అయితే షోకి వెళ్లేముందు పేమెంట్ మాట్లాడుకున్నప్పటికి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును అనాధ పిల్లల కోసం ఉపయోగించాలని అనుకుంటే ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

విజయ్ టీవీకి కృతజ్ఞతలు

విజయ్ టీవీకి కృతజ్ఞతలు

అదే విధంగా బిగ్ బాస్ షోను కొనసాగిస్తున్న విజయ్ టీవీకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో మాటలు కూడా రావడం లేదని సెటైర్ వేసిన కస్తూరి తన జీవితంలో ఎప్పుడు కూడా తప్పుడు వాగ్దానాలను నమ్మలేదని, అయితే చివరికి తనకు మోసమే జరిగిందని అన్నారు. అంతే కాకుండా తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ కొత్త షోను స్టార్ట్ చేయడం విశేషమని కస్తూరి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ నెల 4న తమిళ్ బిగ్ బాస్ షో మొదలుకనుంది.

Recommended Video

Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage
కనీసం సమాధానం కూడా లేదు

కనీసం సమాధానం కూడా లేదు

కస్తూరి చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ నుంచి కూడా భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇక కస్తూరి బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్న విజయ టీవీని ట్యాగ్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పగా వాళ్ళు కనీసం సమాధానం కూడా ఇవ్వకపోడం సిగ్గు చేటని కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల లక్ష్మీ మీనన్ కూడా బిగ్ బాస్ షో ఒక చెత్త షో అంటూ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X