సమంత సినిమాలకు దూరమైనట్లే.. సంతోషంలో చైతు?
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సమంత అక్కినేని. ఆమె మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అపజయాలు పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. జయపజయలతో సంబంధం లేకుండా ముందుకి సాగింది. ఇక సినిమా ఏదైనా సమంత ఆడియెన్స్ ని తన అందంతో ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల సమంతపై ఎన్నడు లేని విధంగా కొన్ని రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి.

సమంతపై ట్రోలింగ్..
సాధారణంగా సమంత మంచి పనులు చేయడంలో ముందుంటుంది. ముఖ్యంగా ఆమె ప్రత్యూష అనే చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి చిన్న పిల్లలకు ఆరోగ్యపరంగా సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె కరోనా బాధితుల కోసం రిలీఫ్ ఫండ్ ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అలాగే కొన్ని మీడియా వెబ్ సైట్స్ కూడా ఆమెపై అనేక రకాల కథనాలు ప్రచారం చేసింది.

సమంత సైలెన్స్ కి కారణమిదే..
అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా సమంత సైలెన్స్ కి అసలు కారణమిదే అంటూ మరొక టాక్ వైరల్ గా మారింది. సమంత లాక్ డౌన్ సమయంలో ఇతర విషయాలు తనపై ప్రభావం చూపకుండా పూర్తిగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోందట. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు సమాచారం. అందువల్లే బయట విషయాలు పట్టించుకోవడం లేదట.

సంతోషంలో చైతు..
2017లో ఒకటైన ఈ జంట వారి వివాహ జీవితంపై ఏనాడు అనుమానాలు రానివ్వలేదు. హ్యాపీగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు న్యూ లవ్ బర్డ్స్ లా దర్శనమిస్తూ ఉంటారు. ఇకపోతే సమంత ఇన్నాళ్లు సినీ కెరీర్ కోసం పిల్లల విషయాన్ని పక్కన పెట్టేసింది. ఇక ఇటీవల సమంత వారసులు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయానికి చైతు హ్యాపీగా ఫీల్ అయ్యాడట.
Recommended Video

సినిమాలకు దూరమైనట్లే..
ఇక ఏడాది పాటు సమంత మరొక సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడానికి కారణం కూడా ఇదేనని సమాచారం. తెలుగులో అయితే సమంత ఎలాంటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇంట్లోనే ఉండాలని సమంత కొన్నాళ్ళు సినిమాలకు దూరం కానుందట. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే సమంత క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..


Click it and Unblock the Notifications











