twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలే బికినీ.. పైగా కింది నుంచి ఫొటో తీసి.. వేడి పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్

    |

    'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాయ్ లక్ష్మీ. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో ఎన్నో అవకాశాలు దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలీవుడ్ చేరిన సంగతి తెలిసిందే.

    అక్కడ కొన్ని సినిమాలతో మెరిసింది. అవే సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. దీంతో రాయ్ లక్ష్మీ కొన్నెళ్ల పాటు వరుస సినిమాలతో బిజీగా గడిపింది. ఈమె నందమూరి బాలకృష్ణ పక్కన 'అధినాయకుడు' సినిమాతో రాయ్ లక్ష్మి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా, ఇక్కడ అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత రవితేజ 'బలుపు', పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో రత్తాలు సాంగ్‌ల్లో కనిపించి కాక రేపింది.

    Another Bikini Feast of Star Heroine

    ఇక, ఆ తర్వాత దక్షిణాది సినిమాలను వదిలేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాయ్ లక్ష్మి నటించిన తొలి సినిమా అకీరా. 2016లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా మరో హీరోయిన్. ఆ తర్వాత 2017లో బాలీవుడ్‌లో తెరకెక్కిన 'జూలీ 2' సినిమాలో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ పోషించింది. అప్పటి నుంచి అమ్మడు గ్లామర్ షో చేస్తూనే ఉంది.

    మన దేశంలోనూ, విదేశాల్లోనూ విహార యాత్రలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు మరో ఫొటోను షేర్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో బ్లూ కలర్ బికినీ వేసుకుని ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అంతేకాదు, 'మంచి వైబ్స్‌‌తో ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాను' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    English summary
    Raai Laxmi turned a fitness freak for Bollywood film Julie 2, which unfortunately turned out to be a huge disappointment at the box office and was panned by critics unanimously.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X