Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అసలే బికినీ.. పైగా కింది నుంచి ఫొటో తీసి.. వేడి పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్
'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాయ్ లక్ష్మీ. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో ఎన్నో అవకాశాలు దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలీవుడ్ చేరిన సంగతి తెలిసిందే.
అక్కడ కొన్ని సినిమాలతో మెరిసింది. అవే సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. దీంతో రాయ్ లక్ష్మీ కొన్నెళ్ల పాటు వరుస సినిమాలతో బిజీగా గడిపింది. ఈమె నందమూరి బాలకృష్ణ పక్కన 'అధినాయకుడు' సినిమాతో రాయ్ లక్ష్మి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా, ఇక్కడ అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత రవితేజ 'బలుపు', పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో రత్తాలు సాంగ్‌ల్లో కనిపించి కాక రేపింది.
ఇక, ఆ తర్వాత దక్షిణాది సినిమాలను వదిలేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాయ్ లక్ష్మి నటించిన తొలి సినిమా అకీరా. 2016లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా మరో హీరోయిన్. ఆ తర్వాత 2017లో బాలీవుడ్లో తెరకెక్కిన 'జూలీ 2' సినిమాలో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ పోషించింది. అప్పటి నుంచి అమ్మడు గ్లామర్ షో చేస్తూనే ఉంది.
Living a good life
— RAAI LAXMI (@iamlakshmirai) July 31, 2019
full of good vibes.❣️#SelfLove ❤️❤️❤️ pic.twitter.com/oxLgooJOhI
మన దేశంలోనూ, విదేశాల్లోనూ విహార యాత్రలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు మరో ఫొటోను షేర్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో బ్లూ కలర్ బికినీ వేసుకుని ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అంతేకాదు, 'మంచి వైబ్స్‌తో ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాను' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.