నీవు బతికేది మూడేళ్లే.. ఆ ఘటనతో కోలుకోలేని దెబ్బ.. దొంగ దొంగ హీరోయిన్ కథ వింటే కన్నీళ్లే!
బాలీవుడ్‌లో తారల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఒక సమయంలో ఎవరికి అందని ఎంతో ఎత్తులో కనిపించేవారు.. మరుక్షణంలో అధోపాతాళంలోకి కూరుకుపోతారు. సినీ తారల జీవితాలు అనిశ్చితం అని చెప్పడానికి అను అగర్వాల్ జీవితం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 90వ దశకంలో ఆషికీ చిత్రం ద్వారా ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన అను అగర్వాల్ అనతికాలంలో కనుమరుగైపోయారు. అలా కెరీర్ అర్దాంతరంగా ముగిసిపోవడానికి ఆ ఒక్క దుర్ఘటనే కారణమని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఎదురైన దుర్ఘటన తర్వాత ఏం జరిగిందంటే..
Recommended Video

ఓవర్‌నైట్‌లో అగ్రతారగా
1990 ఆగస్టు 17వ తేదీకి ముందు ఏ ఒక్కరోజు కూడా అను అగర్వాల్ తన జీవితంలో చోటుచేసుకొనే అపూర్వ సంఘటనలను ఊహించకపోవచ్చు. భారీ ఆశలతో అతి సామాన్య యువతిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అను ఆగస్టు 18 తేదీ సాయంత్రానికి కల్లా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకొన్నారు. అప్పటి నుంచి ఆమె కెరీర్ గ్రాఫ్ కొన్నేళ్లపాటు రివ్వున దూసుకెళ్లింది. ఆ సక్సెస్‌ను జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది అని అను అగర్వాల్ చెప్పుకొంటారు.

రోజుకు 17 గంటలపాటు
1993 సంవత్సరం నాటికి నా పరిస్థితి ఎవరూ ఊహించని విధంగా మారింది. ఇండియాలో ఎంటీవీని ప్రారంభించమని నాకు అవకాశం ఇచ్చారు. వేగంగా సినిమాలు చేస్తున్నాను. రోజుకు 17 గంటలు పనిచేస్తున్నాను. నా టాలెంట్‌ను చూసి మణిరత్నం, రాకేష్ రోషన్ లాంటి పెద్ద డైరెక్టర్లు నాకు అవకాశం ఇచ్చారు. ఇండియాలో పెద్ద కంపెనీల ఉత్పత్తులకు మోడల్‌గా పనిచేశాను. రకరకాల పరీక్షలను ఎదుర్కొన్నాను అని అను అగర్వాల్ చెప్పారు.

నాలో మానసిక ఆనందం కరువై..
బిజీ లైఫ్‌లో నేనేంటో నాకు అర్ధం కాని పరిస్థితి కనిపించేది. ఒంటరిగా ఉండటమనేది చాలా కష్టంగా మారింది. నాలా నా గురించి ఆత్మశోధన మొదలైంది. అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ.. మానసికంగా ఆనందం లేదు. సంతృప్తి లేదు. అప్పుడే జీవితాల్లోకి యోగా ప్రవేశించింది. యోగా, మెడిటేషన్‌ను అలవాటు చేసుకొంటూ నా గురించి నేను తెలుసుకొనే ప్రయత్నం చేశాను అని అను అగర్వాల్ చెప్పారు.

ప్రమాదానికి గురై చావుబతుకుల మధ్య
అప్పుడు.. అంటే 1999లో నా జీవితం భారీ కుదుపుకులోనైంది. నేను దారుణమైన ప్రమాదానికి గురయ్యాను. జీవన్మరణ పోరాటంలో పలు రకాల సర్జరీలు చేసి నా ప్రాణాలు కాపాడారు. కానీ మూడేళ్లకంటే ఎక్కువగా బతకవని చెప్పారు. ఆయినా నా జీవితంపై చావని ఆశ ఉండేది. ఎలాగైనా ఆరోగ్యంతో పుంజుకొంటానని ఆశ నన్ను వెంటాడేది. యోగా, మెడిటేషన్‌తో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని పరిపుష్టిగా మార్చుకొన్నాను అని అను అగర్వాల్ చెప్పారు.

యాక్సిడెంట్ తర్వాత నా జీవితం
1999 తర్వాత నా జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు జీవిత పాఠాలుగా మారాయి. కెరీర్ గాడిన పెట్టేందుకు ప్రయత్నించాను. ఏదో ఒకటి.. ఎవరో అడ్డుకున్నట్టు అనిపించేది. ఇక చేసేది ఏమీ లేక మురికివాడల్లో పిల్లలకు యోగా థెరపీ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నాతో కొన్ని సంస్థలు కలిసి పనిచేయడం మొదలుపెట్డడం ప్రారంభించాయి. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే యోగా, మెడిటేషన్‌కు సంబంధించిన ఒక సంస్థను నడుపుతున్నాను అని అను అగర్వాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











