twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆఫర్ అడిగితే కోరిక తీర్చమనే వారు.. నా బతుకు సుశాంత్‌లానే.. దొంగ దొంగ హీరోయిన్ బాంబు

    |

    బాలీవుడ్‌లో ఇండస్ట్రీ కుటుంబాలకు చెందని అవుట్ సైడర్స్‌కు నానా రకాల వేధింపులు ఉంటాయనే విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు బయటపెడుతున్నారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఇలాంటి విషయాలు మీడియాలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. తాజాగా 90వ దశకంలో యువతను ఉర్రూతలూగించిన అను అగర్వాల్ గతంలో జరిగిన విషయాలను తాజాగా నోరు విప్పి ఓ బాంబు పేల్చినంత పనిచేశారు. అను అగర్వాల్ గురించి, ఆమె చెప్పిన విషయాల గురించి..

    ఓవర్‌నైట్ స్టార్‌గా ఆషికీ హీరోయిన్‌

    ఓవర్‌నైట్ స్టార్‌గా ఆషికీ హీరోయిన్‌

    90వ దశకంలో మైనే ప్యార్ కియా లాంటి సంచలన విజయం తర్వాత వచ్చిన చిత్రం ఆషికి. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వ వహించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఆషికిలో జంటగా నటించిన రాహుల్ రాయ్, అను అగర్వాల్ ఓవర్‌నైట్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు అయ్యారు. అప్పుడే పరిచయమైన సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీకి పోటీగా ఎదిగారు.

    అషికి.. దొంగ దొంగలో చంద్రలేఖగా

    అషికి.. దొంగ దొంగలో చంద్రలేఖగా

    ఆషికి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో అను అగర్వాల్ కనిపించారు. గజబ్ తమాషా, కింగ్ అంకుల్, ఖల్ నాయికా లాంటి సినిమాల్లో కనిపించారు. తెలుగు, తమిళ భాషల్లో మణిరత్నం రూపొందించిన దొంగ దొంగ చిత్రంలో అను అగర్వాల్ కొంచెం నీరు. కొంచెం నిప్పు పాటలో చంద్రలేఖగా అందాలతో కనువిందు చేశారు. అయితే ఎంత త్వరగా పాపులారిటీని సాధించారో అంతే వేగంగా కనుమరుగైపోయారు. తాజాగా ఓ ఇంటరవ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు.

    అవుట్ సైడర్ అనే ముద్ర వేసి

    అవుట్ సైడర్ అనే ముద్ర వేసి

    అయితే అషికీ లాంటి భారీ విజయం తర్వాత కూడా అను అగర్వాల్‌కు సరైన ఆఫర్లు లభించలేదు. అందుకు అవుట్ సైడర్ అనే ముద్రనే అని అను అగర్వాల్ తాజాగా నోరు విప్పింది. ఇండస్ట్రీ ఫ్యామిలీ కాకపోవడంతో రకరకాల వేధింపులు ఉండేవి. వాటిని తట్టుకోలేకనే చాలా సినిమాలు వదులేసుకొన్నాను అని అను అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో ఆవేదనను వ్యక్తం చేశారు.

    మా పాపులారిటినీ చూసి జీర్ణించుకోలేక

    మా పాపులారిటినీ చూసి జీర్ణించుకోలేక

    అషికి విజయం తర్వాత మాకు ఎదురైన పరిస్థితిని ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. సక్సెస్ అనంతరం ఇండస్ట్రీలోని వాళ్లు మాకు వచ్చే పాపులారిటీని చూసి జీర్ణించుకోలేకపోయారు. మమల్ని దారుణంగా వేధించడం, చులకనగా చూడటం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితులను చూసి నేను తట్టుకోలేకపోయాను కానీ నా ఆత్మస్థైర్యాన్ని వదులుకోలేదు. ఏ దశలోనూ కోపంతో ఊగిపోలేదు. ఆ సమయంలో వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి అని అను అగర్వాల్ తెలిపారు.

    సుశాంత్ సింగ్‌కు ఎదురైన పరిస్థితులే

    సుశాంత్ సింగ్‌కు ఎదురైన పరిస్థితులే

    సక్సెస్ అందుకొన్నప్పటికీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఎదురైన పరిస్థితులే నాకు ఎదురయ్యాయి. ఇండస్ట్రీకి సంబంధం లేని వారంతా సుశాంత్‌తో ఈజీగా పోల్చుకోవచ్చు. నాకు ఎదురైన అవమానాలను సహనంతో భరించాను. ఆ సమయంలో ఎవరు కూడా అండగా నిలువని పరిస్థితి. ఎవరినైనా సహాయం కోరితే వారు నా నుంచి మరోటి ఆశించే వారు. అలాంటి వాటికి నేను తలవొగ్గకూడదని నిర్ణయించుకోవడం వల్ల చాలా ఆఫర్లను మిస్ అయ్యాను అని అను అగర్వాల్ తన బాధను వ్యక్తం చేశారు.

    Recommended Video

    Sushant Singh Rajput: 90వ దశకంలో కూడా Nepotism, Outsiders కి ఆఫర్స్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే ?
    ఆఫర్లు కావాలంటే అలా సమర్పించుకోవాల్సిందే

    ఆఫర్లు కావాలంటే అలా సమర్పించుకోవాల్సిందే

    ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభ కాదు.. అనవసరపు విషయాలు ఎక్కువగా ఉంటాయనేది నాకు చిన్న వయసులోనే అర్ధమైంది. ఎన్నోసార్లు ఆఫర్ల కోసం ప్రయత్నిస్తే వారు కోరికలు తీర్చమని అడిగిన సందర్భాలు ఎదురయ్యాయి. అందుకే నేను సినిమాలకు క్రమక్రమంగా దూరమయ్యాను అని అను అగర్వాల్ అన్నారు. కొన్ని విషయాల్లో రాజీ పడలేక కెరీర్‌ను త్యాగం చేశాను అని అను అగర్వాల్ పేర్కొన్నారు.

    English summary
    Bollywood actress Anu Aggarwal open up ill treatment for outsiders in bollywood amid Sushant Singh Rajput's suicide. She said recent interview that, I understood at a very young age that you cannot take favour because then they will want something in return.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X