twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి తప్పు మళ్లీ చేయను.. దెబ్బకు తత్త్వం బోధపడింది.. హీరోయిన్ ఆవేదన

    |

    జోరు మీదున్నప్పుడు లెక్కచేయకుండా ఉండటం, వచ్చిన ప్రతీ ఆఫర్‌ను ఒకే చేయడం, తీరా ఫలితాలు చూశాక ఘోల్లుమనడం శరా మామూలే. అంతా అయ్యాక పునరాలోచనలో పడటం అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వంటిదే అవుతుంది. ప్రస్తుతం కేరళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ కూడా అలాంటి స్థితిలోనే ఉంది. తన గతాన్ని తలుచుకుంటూ తెగ బాధపడుతోంది. ఆమె బాధ ఏంటో ఓ సారి చూద్దాం.

    బోణీ బాగానే కొట్టింది..

    బోణీ బాగానే కొట్టింది..

    నాని హీరోగా వచ్చిన మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కేరళ భామ. ఈ సినిమా ఓ మోస్తరుగా మెప్పించడం, అనుకు మంచి పేరు రావడం ఆపై ఆఫర్లు వెల్లువెత్తాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవడంతో రాజ్ తరుణ్, గోపిచంద్ వంటి వారి సరసన నటించింది.

    బోల్తా కొట్టిన చిత్రాలు..

    బోల్తా కొట్టిన చిత్రాలు..

    ఇలా వచ్చిన ప్రతీ ఆఫర్‌ను ఒకే చేయడంతో అనుకు బాగా మైనస్ అయింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్తా, ఆక్సీజన్, శైలజా రెడ్డి అల్లుడు వంటి ఫ్లాపులను మూటగట్టుకుంది. పోనీ.. మీడిల్ రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఎదిగిందని అనుకుంటూ ఉంటే.. అవే ఆమెను పాతాళానికి తొక్కేశాయి.

    డిజాస్టర్లుగా భారీ చిత్రాలు..

    డిజాస్టర్లుగా భారీ చిత్రాలు..

    నా పేరు సూర్య, అజ్ఞాతవాసి వంటి స్టార్ హీరోల సినిమాల్లో అను ఇమ్మాన్యుయేల్ చాన్స్ దక్కించడంతో సుడి తిరిగిందని అంతా భావించారు. అయితే అవి రెండూ డిజాస్టర్స్ కావడంతో అను వైపు ఎవ్వరూ తిరిగి చూడనేలేదు. నా పేరు సూర్య కోసం గీత గోవిందం లాంటి సినిమాను కూడా వదులుకుని పెద్ద తప్పు చేసింది.

    Recommended Video

    Anu Emmanuel In Bellamkonda And Santhosh Srinivas's Next Movie
    ఇకపై అలాంటి తప్పు చేయను..

    ఇకపై అలాంటి తప్పు చేయను..

    సినీ రంగంలోకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. కథ చెప్పడానికి వచ్చినవారు తన పాత్ర మాత్రమే చెప్పేవారని, సినిమా కథేమిటో కూడా తెలిసేది కాదని పేర్కొంది. ఏమీ తెలియకుండానే సినిమా చేసేదాన్ని చెప్పుకొచ్చింది. దాంతో ఆ సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయని, ఇక నుంచి అలాంటి తప్పులు చేయదలుచుకోలేదని తెలిపింది. పూర్తి
    స్క్రిప్ట్‌తో వస్తేనే సినిమా చేయాలని అనుకుంటున్నానని తెలిపింది. మొత్తానికి ఇన్నాళ్లకు అనుకు తత్త్వం బోధపడినట్టుంది. మరి ఇకనైనా విజయాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Anu Emmanuel About Choosing Scripts. At Earlier Stage She Don't know That How To Select A Script, And They Didnt Tell Full Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X