ఫామ్‌లోకి వచ్చిన అజ్ఞాతవాసి బ్యూటీ.. ఆ రెండు సినిమాలు హిట్టయితే చాలట..

కొన్నిసార్లు హీరోయిన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు ఉహీంచని విధంగా డిజాస్టర్స్ అవుతుంటాయి. ఆ సినిమాల ప్రభావం ఎంతగా ఉంటుందంటే మళ్ళీ మరో అవకాశం దొరకనంత పరిస్థితి ఏర్పడుతుంది. అదే తరహాలో అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా కోలుకోలేని విధంగా కొన్ని అపజయాలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఎంతగానో బూస్ట్ ఇస్తాయని అనుకున్న అజ్ఞాతవాసి, నా పేరు సూర్య దారుణంగా బెడిసికొట్టాయి.

ఇక అమ్మడి సంగతి ఆ రెండు సినిమాలతోనే అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ శైలజారెడ్డి అల్లుడు సినిమాతో పరవలేదనిపించే విదంగా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. అనంతరం తమిళ్ లో శివకార్తికేయన్ తో మరో హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ రెండు విభిన్నమైన సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్దార్థ్, శర్వానంద్ కలిసి నటిస్తున్న మహాసముద్రం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

Anu emmanuel big hopes on her upcoming movies

అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న అల్లుడు అదుర్స్ అనే మాస్ ఎంటర్టైనర్ లో కూడా అవకాశం అందుకున్న అనూ త్వరలోనే మరో రెండు తమిళ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ్ సంగతి పక్కనపెడితే తెలుగులో మహాసముద్రం, అల్లుడు అదుర్స్ లో అనూకు మంచి రోల్స్ దక్కాయట. ఈ రెండు సినిమాలు హిట్టయితే అమ్మడి క్రేజ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అనూ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X