‘మహాసముద్రం’కు లైట్ హౌస్.. అను ఇమాన్యుయల్ స్పెషల్ పోస్టర్
అను ఇమాన్యుయేల్‌కు ప్రస్తుతం తెలుగులో అంత పాపులారిటీ లేదు. చాలా రోజుల క్రితం అల్లుడు అదుర్స్ అనే చిత్రంతో అను ఇమాన్యుయేల్ టాలీవుడ్‌ను పలకరించింది. కానీ అది డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ అను ఇమాన్యుయేల్ పరిస్థితి మొదటికే వచ్చింది. సినిమాలు హిట్ కాకపోయినా సరే అవకాశాలు వస్తుంటాయి. సరైన సక్సెస్ కోసం అను ఇమాన్యుయేల్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.
నేడు (మార్చి 28) అను ఇమాన్యుయేల్ బర్త్ డే. ఈసందర్బంగా మహాసముద్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శర్వా నంద్ సిద్దార్త్ ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అను ఇమాన్యుయల్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నేటి పుట్టిన రోజు సందర్బంగా అను ఇమాన్యుయేల్‌కు విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. ఈమేరకు చిత్రయూనిట్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

మహా సముద్రం సినిమాకు అను ఇమాన్యుయేల్ లైట్ హౌస్ లాంటిదని మూవీ యూనిట్ చెప్పుకొచ్చింది. బ్యూటీ ఫుల్ అను ఇమాన్యుయేల్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఈ సినిమాలో అను ఇమాన్యుయేల్‌తో పాటు అదితీ రావ్ హైదరీ కూడా నటిస్తోంది. ఈ మూవీలో జగపతి బాబు అదిరిపోయే పాత్రను పోషిస్తోన్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











