Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
వాళ్ళ సంగతేమో గానీ.. వీళ్ళను నమ్ముకున్న అందాల భామ.. అను ఇమ్మాన్యుయేల్ డేరింగ్ స్టెప్స్
సినిమా ఇండస్ట్రీలో అందరికీ అన్నీ కలిసిరావనేది జగమెరిగిన సత్యం. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం వెన్నుతట్టనిదే సూపర్ హిట్స్ ఖాతాలో పడవు. స్టార్ హీరోలతో, పెద్ద దర్శకులతో అవకాశం వచ్చినా అది అంతగా కలిసిరాదు. సరిగ్గా ఇదే పరిస్థితి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ది.
మజ్ను చిత్రంతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు పట్టేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, నాగచైతన్య సరసన శైలజారెడ్డి అల్లుడు సినిమాల్లో నటించింది. కానీ అవేవీ అమ్మడి కెరీర్‌ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి.
దీంతో తమిళ ఇండస్ట్రీకి మకాం మార్చిన ఈ బ్యూటీ.. అక్కడ శివకార్తికేయన్‌తో నమ్మవీట్టు పిళ్లై చిత్రంలో నటించింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ తెలుగు తెర వైపు కాన్నేసింది. అయితే అప్పట్లో స్టార్ హీరోలను నమ్ముకున్న ఈమె, ఇప్పుడు మాత్రం మీడియం రేంజ్ హీరోలతో కమిట్ అవుతోంది. ఏ అవకాశం వచ్చినా వదిలేదే లేదని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు అల్లు శిరీష్ సరసన ఓ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన అను.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కానుంది.