నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చైతు హీరోయిన్!
కింగ్ నాగార్జున మల్టీస్టారర్ చిత్రాల జోరు పెంచుతున్నాడు. నాగార్జున ఇప్పటికే నానితో దేవదాస్ చిత్రాలలో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజగా నాగార్జున మరో మల్టీస్టారర్ చిత్రాన్ని కూడా ఒకే చేశాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలసి నటించబోతున్నాడు. ఈ చిత్రానికి ధనుషే దర్శత్వం వహిస్తాడు. ఈ చిత్రంలో అతిధి రావు హైదరి ఓ హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ గా అను ఏను ఇమ్మాన్యుయేల్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే నాగ చైతన్య సరసన నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూపొందే చిత్రంలో అవకాశం రావడం అదృష్టమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











