అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. లిల్లీతో నందమూరి ఫ్యాన్స్ దారుణంగా!

సినీ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమ కొన్నిసార్లు హద్దులు దాటుతుంటుంది. అయితే తమకు నచ్చిన హీరోలపై ఉంచే పిచ్చి ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తుంటుంది. చాలాసార్లు సినిమా వేడుకల్లో తోటి ఆర్టిస్టులు చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సంఘటనే ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎదురైంది. టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తొలి నటీనటులకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైందంటే..

డిజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన టిల్లు స్క్వేర్ చిత్రం ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. దాంతో ఈ నిర్మాతలు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు గెస్టుగా ఎన్టీఆర్ రావడంతో నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు.

Anupama Parameshwaran gets bitter Experience from Jr NTR fans at Tillu Square success meet

అయితే నందమూరి తారక రామారావును చూడగానే ఫ్యాన్స్ అభిమానం కట్టలు తెంచుకొన్నది. జూనియర్‌ను చూసిన ఆనందంలో కేరింతలు, ఈల కొట్టి గోల చేశారు. అయితే వేదికపై సినిమా యూనిట్ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. జై ఎన్టీఆర్ అంటూ గోలగోల చేశారు. దాంతో స్టేజీ మీద తన అనుభూతులను పంచుకోవాలన్న వారికి నిరాశే ఎదురైంది.

ఇక తన అభిమానులు చేస్తున్న అల్లరిని ఎన్టీఆర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారి హద్దు మీరి నినాదాలు చేస్తూ ఇతరుల స్పీచ్‌లకు ఆటకం కలిగించారు. అయితే యాంకర్ సుమ, ఇతర నిర్వాహకులు వారిని అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ సమయంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వేదికపైకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసింది.

Anupama Parameshwaran gets bitter Experience from Jr NTR fans at Tillu Square success meet

అయితే అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతుండగా.. నందమూరి అభిమానులు అడ్డు తగిలారు. అయితే రెండే నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండి.. నేను రెండు ముక్కలు మాట్లాడి వెళ్తాను అంటూ బతిమలాడింది. అయినా నందమూరి ఫ్యాన్స్ ఏ మాత్రం కనికరించలేదు. అలాగే గోల చేస్తుంటే ఆమె మాట్లాడకుండానే వేదిక నుంచి కిందకు దిగింది.

ఇక గతంలో కూడా ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. స్వయానా నందమూరి కల్యాణ్ రామ్‌కే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కల్యాణ్ రామ్ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తారక్ అభిమానుల మాట్లాడనివ్వకుండా అరుపులు అరిచారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కల్యాణ్ రామ్ కూడా మాట్లాడకుండానే తన స్పీచ్ మధ్యలోనే కుదించుకొన్నారు. ఎన్టీఆర్ అభిమానులు తీరుపై ఈవెంట్‌లోనే కొందరు అసహనం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X