100 మంది చూస్తుండగా కారులో లిప్‌లాక్ సీన్.. ఆ ప్లేస్‌లో తీవ్రమైన గాయాలు.. అనుపమ పరమేశ్వరన్
తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన చిత్రం డీజే టిల్లు. ఆ సినిమా సాధించిన సక్సెస్ యూత్‌ఫుల్ రొమాంటిక్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్ చేసింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న టిల్లు స్క్కేర్‌లో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రకు దూరంగా ముద్దులతో హడలెత్తించింది. మార్చి 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..
నేను ఎప్పుడూ క్యూట్ హీరోయిన్ పాత్రలే చేయాలని అనుకొన్నాను. నేను ఎప్పుడూ కూడా హాట్ హీరోయిన్‌గా నటిస్తానని అనుకోలేదు. కానీ సింపుల్, పక్కింటి అమ్మాయి పాత్రలు చేసి చేసి బోర్ కొట్టింది. అందుకే టిల్లు స్క్వేర్ సినిమాలోని లిల్లీ పాత్ర వినగానే నాకు నేనుగా కొత్తగా కనిపించడానికి అవకాశం ఉన్న పాత్ర అనిపించింది అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.

సినిమాల్లో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా కష్టం. షూటింగ్ సమయంలో హీరోతో సన్నిహితంగా నటించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చుట్టూ 100 మంది ఉంటారు. వారి ముందు అలా నటించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రైవేట్ మూమెంట్స్ అందరి ముందు చేయడం చాలా కష్టం అని అనుపమ పరమేశ్వరన్ తన అనుభవాలను వెల్లడించారు.

టిల్లు స్క్వేర్ సినిమా టీజర్, ట్రైలర్‌లో చూపించిన విధంగా కారులో సీన్ చాలా కష్టం. అలాంటి సీన్‌లో నటించడం అంత ఈజీ కాదు. కారులో ఆ సీన్ చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. మొకాళ్లకు రెండు గాయాలు కూడా అయ్యాయి. అలాంటి సిచ్యుయేషన్ చేసి ఆ సీన్ నుంచి బయటకు రావడం నరకంగా ఉంటుంది అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.

మీకు కేవలం లిప్‌లాక్ సీనుగానో లేదా ముద్గు సీన్ గానో కనిపిస్తాయి. కానీ అలాంటి సీన్‌లో ఫీల్ ఉండాలి. ఎక్స్‌ప్రెషన్ మిస్ కాకూడదు. ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా నటించాలి. ఈ రొమాన్స్ చూసిన వాళ్లకు వాళ్లేదో ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఊహించుకొంటారు. కానీ అది నిజం కాదు అని అనుపమ తెలిపారు.


Click it and Unblock the Notifications











