రొమాన్స్‌తో పాటు రెమ్యునరేషన్‌ను కూడా పెంచేసిన అనుపమ.. టిల్లు స్క్వేర్ కోసం ఎంత పుచ్చుకుందంటే?

Anupama Parameshwaran Remuneration: అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలతో అంతకు మించిన నటన కనబరుస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ముఖ్యంగా 2015లో మలయాళంలో ప్రేమమ్ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈమె ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేయలేదు. కానీ తొలిసారి టిల్లు స్క్వేర్ సినిమాలో విపరీతమైన గ్లామర్ షో చేసింది.

అంతేకాదండోయ్... టిల్లు గాడితో ఘుటాగా రొమాన్స్ చేస్తూ హీటెక్కిస్తోంది. రొమాన్స్, గ్లామర్ తో పాటు.. రెమ్యునరేషన్ ను కూడా విపరీతంగా పెంచేసిందని టాక్ నడుస్తోంది. రొమాంటిక్ సీన్లు, లిప్ లాక్ లు ఎక్కువగా ఉండడంతో.. పారితోషికం కూడా బాగానే అడిగిందని సమాచారం. మరి ఈ ముద్దుగుమ్మ టిల్లు స్క్వేర్ సినిమా కోసం ఎంత పుచ్చుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anupama Parameshwaran Shocking Remuneration For Tillu Square Movie Check Details

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో రాబోతున్న సరికొత్త చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించబోతున్నారు. సితార ఎంటర్​టైన్మెంట్స్​, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పోస్టర్ లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ముఖ్యంగా పద్ధతిగా ఉండే అనపమ పరమేశ్వరన్ ను పూర్తిగా మార్చేశారు. ఆమె అందాలతో పాటు.. రొమాన్స్ ఘాటును కూడా నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లారు. అనుపమ ఇలాంటి పాత్రలో కనిపంచడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఘాటు లిప్ లాక్ సీన్లు, అంతకు మించిన రొమాంటిక్ సీన్లు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా కోసం అనుపమ గట్టిగానే రెమ్యునరేష్ తీసుకుంటుందట.

Anupama Parameshwaran Shocking Remuneration For Tillu Square Movie Check Details

తాను ఇప్పటి వరకు కనిపించని పాత్రలో కనిపించడంతో పాటు విపరీతమై గ్లామర్ షో, రొమాంటిక్ సీన్లలో కనిపిస్తుండడంతో.. తాను ఎప్పుడూ తీసుకునే దానికంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో టిల్లు గాడి లవర్ గా నటించినందుకు 2 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందట. అంతకు ముందు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకునే ఈమె.. ఈ సినిమాకు మాత్రం 2 కోట్లు తీసుకుని తన గ్రాఫ్ ను విపరీతంగా పెంచేసింది. మరి మార్చి 29వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X