ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ.. ఆ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు: అనుపమ పరమేశ్వరన్

మలయాళం క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తన సొంత భాషలో కంటే తెలుగులోనే చాలా ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఒకవైపు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న హీరోలతో కూడా నటించడానికి ఏమాత్రం స్పందించడం లేదు. అయితే చాలా రోజులుగా అనుపమ పరమేశ్వరన్ తన రిలేషన్షిప్ పై ఎవరూ ఊహించని విధంగా స్పందిస్తోంది. తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అంటూ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 మొదట్లోనే విజయాలు

మొదట్లోనే విజయాలు

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగులో అడుగు పెట్టిన మొదట్లోనే మంచి విజయాలను సొంతం చేసుకుంది. అఆ, శతమానంభవతి వంటి సినిమాలు ఈ బ్యూటీ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. ప్రస్తుతం కూడా చేతిలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి.

మొదటి లిప్ లాక్ సీన్

మొదటి లిప్ లాక్ సీన్

ఇటీవల వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సినిమాలో అమ్మడు మొదటిసారి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి అభిమానులనుకి పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. అసలు రొమాంటిక్ సన్నివేశాలలో ఇంతవరకు డోస్ పెంచని అనుపమ మొదటిసారి లిప్ లాక్ సన్నివేశంలో కనిపించడంతో ఒక్కసారిగా ఆ సినిమాకు హైప్ అయితే వచ్చింది.

ప్రేమలో న్యూ ట్విస్ట్

ప్రేమలో న్యూ ట్విస్ట్

ఒక విధంగా అనుపమ పరమేశ్వరన్ మెల్లగా తన నటన విషయంలో మార్పులు కూడా చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఈ బ్యూటీ గతంలో ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆ క్రికెటర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ వచ్చింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఎవరి ప్రేమ లేదని కూడా అనుకున్నారు. కానీ ఇటీవల ఆమె తాను ప్రేమలో ఉన్నాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చింది.

 లవ్ మ్యారేజ్ పక్కా

లవ్ మ్యారేజ్ పక్కా


ప్రేమ వివహమే చేసుకోవాలని ఉంది అంటూ ఆ తరహాలో ఒకటైన జంటను చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది అని తన జీవితంలో అయితే ప్రేమ వివాహం జరుగుతుంది అని అనుపమ తెలియజేసింది. తన తల్లిదండ్రులకు కూడా తన మ్యారేజ్ విషయంలో ఓ క్లారిటీ ఉంది అని కచ్చితంగా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని వారికి కూడా తెలుసు అని తెలియజేసింది.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
వన్ సైడ్ లవ్

వన్ సైడ్ లవ్


అయితే నా రిలేషన్షిప్ స్టేటస్ విషయంలో మాత్రం తనకే సరిగా క్లారిటీ లేదు అంటూ నేనైతే ప్రేమలో ఉన్నాను అని వివరణ ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే తనది వన్ సైడ్ లవ్ అంటూ అవతలి సైడ్ ఏమనుకుంటున్నారో తెలియదు అని కూడా అనుపమ వివరణ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి అనుపమ మనసును దోచేసిన ఆ వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ఆమె అసలు నిజం ఆమెనే చెప్పాలి అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X