బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. లైవ్ లోనే షాకింగ్ కామెంట్!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చాలా విభిన్నంగా దర్శనమిస్తోంది. ఆమె ఏలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా ఆమెను మెల్లగా గ్లామర్ వైపు కూడా చాలా కొత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీ లో అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అయితే ఇటీవల సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ లవ్ బ్రేకప్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది.

 ఫోకస్ మొత్తం తెలుగు సినిమాల పైనే..

ఫోకస్ మొత్తం తెలుగు సినిమాల పైనే..

ఈ మలయాళీ బ్యూటీ అ ఆ సక్సెస్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా బిజీగా కనిపిస్తుంది. తమిళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె ఫోకస్ మొత్తం ఎక్కువగా తెలుగు ఆఫర్స్ పైన పెడుతున్నట్లుగా తెలుస్తోంది. సక్సెస్ వచ్చినా రాకపోయినా కూడా అనుపమ చాలా ఎక్కువగా తెలుగు సినిమాలలో కనిపిస్తోంది.

ఆ సినిమా తరువాత..

ఆ సినిమా తరువాత..

త్రివిక్రమ్ అఆ సినిమాతో తెలుగులోకి ప్రవేశించిన ఈ బ్యూటీ ఆ తర్వాత శతమానం భవతి సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎక్కువగా మీడియం హీరోలతోనే వర్క్ చేస్తూ వచ్చింది. కానీ ఈ బ్యూటీ కి శతమానం భవతి తర్వాత మళ్లీ సరైన విజయం రాలేదు. ఆ మధ్య లో రాక్షసుడు సినిమా పర్వాలేదు అనే విధంగా సక్సెస్ అయింది. కానీ ఆ సినిమా ఆమె రేంజ్ ను మాత్రం అంతగా పెంచలేక పోయింది.

సక్సెస్ వచ్చినా రాకపోయినా

సక్సెస్ వచ్చినా రాకపోయినా

ఏది ఏమైనా కూడా సక్సెస్ వచ్చినా రాకపోయినా అనుపమ పరమేశ్వరన్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఆ మధ్యలో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక టీమిండియా క్రికెటర్ తో అనుపమ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కూడా మలయాళం మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

క్రికెటర్ తో లవ్?

క్రికెటర్ తో లవ్?

ఇక క్రికెటర్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని రూమర్స్ కూడా గట్టిగానే వచ్చాయి. కానీ ఆ క్రికెటర్ ఒక అమ్మాయి ని పెళ్లి చేసుకోవడంతో అనుపమా పరమేశ్వరన్ లవ్ లో కూడా ఫెయిల్ అయ్యింది అన్నట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వచ్చాయి.

 బ్రేకప్ అయ్యింది అంటూ

బ్రేకప్ అయ్యింది అంటూ

ఇక రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే లవ్ బ్రేకప్ గురించి అడుగగా అవును నిజమే నేను ప్రేమలో ఫెయిల్ అయ్యాను అంటూ చాలా క్లారిటీ గా బ్రేకప్ గురించి తెలియజేసింది. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈ బ్యూటీ బయట పెట్టలేదు.

దీంతో అందరూ కూడా మళ్లీ ఆ క్రికెటర్ పేరును వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

 సినిమాల విషయానికి వస్తే..

సినిమాల విషయానికి వస్తే..

అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే.. ఈ సంక్రాంతికి రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి నటించిన ఆ సినిమాలో అనుపమ కావ్య అనే పాత్రలో కనిపించబోతోంది. అలాగే సిద్ధార్థతో 18 పేజిస్ అనే సినిమాతో పాటు కార్తికేయ సీక్వెల్ లో కూడా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X