Anupama Parameswaran: పెళ్లి కాని యువ హీరోతో అనుపమ.. ఏకంగా రాత్రి థియేటర్‌లో!

బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో విభిన్నమైన గ్లామర్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. గతంలో తాను ప్రేమలో ఉన్నట్లు కూడా తెలియజేసింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా తెలిపింది. ఆమె ఒక రోజు రాత్రి సమయంలో యువ హీరోతో ప్రత్యేకంగా సినిమాకు కూడా వెళ్లిందట. ఇక ఆ సినిమా ఏది అనే వివరాల్లోకి వెళితే..

కంటిన్యూగా సినిమాలు

కంటిన్యూగా సినిమాలు

త్రివిక్రమ్ నితిన్ కలయికలో వచ్చిన అఆ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ అంతకుముందే ప్రేమమ్ సినిమాతో సౌత్ మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా శతమానం భవతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

Recommended Video

బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
రిజల్ట్ తో సంబంధం లేకుండా

రిజల్ట్ తో సంబంధం లేకుండా


క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల కాలంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే అందుకోవటం లేదు. కానీ రిజల్ట్ తో సంబంధం లేకుండానే అనుపమకు మంచి అవకాశాలు వస్తున్నాయి. టాలెంటెడ్ ఉన్న నటి కావడంతో కొన్ని ప్రత్యేకమైన కథలు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి అని చెప్పవచ్చు.

కార్తికేయ 2

కార్తికేయ 2

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఆశలన్నీ కూడా కార్తికేయ 2 సినిమా పైన పెట్టుకుంది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. ఇక మొత్తానికి అనుపమ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక గ్యాప్ లేకుండా ఆమె వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై పాజిటివ్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది.

యువ హీరోతో.. అలా..

యువ హీరోతో.. అలా..

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఎవరికి తెలియని ఒక విషయాన్ని కూడా తెలియజేసింది. ఒకరోజు యువ హీరోతో కలిసి సినిమాకు కూడా వెళ్లిందట. ఇక ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్ అని తెలియజేసింది. శతమానం భవతి సినిమా రిలీజ్ టైమ్ లోనే మరో హీరో సినిమా చూసేందుకు రాత్రిపూట సినిమా థియేటర్ కు వెళ్లారట.

మెగాస్టార్ సినిమా కోసం..

మెగాస్టార్ సినిమా కోసం..

ఆ విషయంపై అనుపమ క్లారిటీ ఇస్తూ.. శతమానం భవతి సినిమా రిలీజ్ టైం లోనే ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో నేను శర్వా కలిసి సంక్రాంతి సమయంలోనే రాత్రి సినిమా చూసేందుకు ధియేటర్ కి వెళ్ళాము. ఆ సమయంలో మా అమ్మ కూడా నాతో ఉన్నారు. శర్వానంద్ కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఆ రోజు మా సినిమా విడుదలైనప్పటికీ కూడా మెగాస్టార్ కం బ్యాక్ మూవీ కాబట్టి ఎంతో ఆసక్తితో చూడడానికి వెళ్లినట్లు అనుపమ తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X