నేను ఆ టైప్.. అలాంటి వాటిని నమ్ముతాను.. అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

అందానికి ఓ రూపముంటే అది అనుపమా పరమేశ్వరన్ అవుతుందేమో! అనేట్టుగా సౌందర్యంతో కట్టిపడేస్తుంది ఈ కేరళకుట్టి. ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకుల మనసును దోచిన ఈ చిన్నది తెలుగు నాట ఎందరి హృదయాల్లోనో చిచ్చు పెట్టింది. సినిమాలకు దూరంగా ఉన్నా.. అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా అనుపమా చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో ఓ సారి చూద్దాం.

అదృష్టం లేని భామ..

అదృష్టం లేని భామ..

అందం పుష్కలంగా ఉన్నా కూడా అదృష్టం లేని అనుపమకు ఒక కమర్షియల్ హిట్ లేదు. అన్నీ కూడా యావరేజ్ సినిమాలే పడ్డాయి.హిట్ అయిన చిత్రంలో అనుపమకు షేర్ లేకుండా పోయింది. దీంతో అనుపమకు అవకాశాలు సన్నగిల్లాయి.

ప్రస్తుతం చేతిలో..

ప్రస్తుతం చేతిలో..


అనుపమ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌లు ఏవీ లేవు. మలయాళంలో ఓ ప్రాజెక్ట్, కోలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ మాత్రమే ఉన్నాయి. దిల్ రాజు ఇంటి నుంచి హీరోగా పరిచయం కాబోతోన్న చిత్రంలో అనుపమను హీరోయిన్‌గా ఎంచుకున్నారని టాక్ నడుస్తోంది. ఇలా ఒక్కటంటే ఒక్క స్టార్ ప్రాజెక్ట్ చేతిలో లేక బాగా వెనక్కివెళ్లిపోయింది.

నేను ఆ రకాన్ని..

నేను ఆ రకాన్ని..

పాత తరం జీవన విధానం గురించి అస్సలు అలోచించడం లేదని, ఆచార వ్యవహారాలను ఆచరించడానికి ఇష్ట పడడం లేదని అనుపమా హితబోధ చేసింది. అయితే తాను మాత్రం అలాంటి రకాన్ని కాదని తెలిపింది. పాత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను నమ్మే రకానన్ని చెప్పుకొచ్చింది.

Recommended Video

Anupama Parameswaran Speech At Rakshasudu Movie Press Meet || Filmibeat Telugu
అలాంటి వాటిని నమ్ముతాను..

అలాంటి వాటిని నమ్ముతాను..

పెద్దల మాటలకు గౌరవం ఇస్తానని, రాహు కాలం, అష్టమి, నవమి, మంచి గడియలు వంటి వాటిని నమ్ముతానని తెలిపింది. వాటి గురించి పెద్దలు ఊరికే చెప్పలేదని. వాటిని ఆచరిస్తే సంప్రదాయబద్ధమైన జీవినాన్ని సాగించవచ్చని సూచించింది. జీవితమంటేనే నమ్మకం కదా అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X