Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక్క లిప్ లాక్ తో ఎన్ని లాభాలో.. అనుపమ పరమేశ్వరన్ దశ తిరిగేలా బంపరాఫర్స్..?
ఒకవిధంగా హీరోలకంటే హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు అని చెప్పవచ్చు. ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే వాళ్లకు ఎంత స్పీడ్ గా ఆఫర్లు వస్తుంటాయో డిజాస్టర్ వస్తే మాత్రం అంతే స్పీడ్ గా కెరీర్ డౌన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏడాదిలో పదుల సంఖ్యలో మోడల్స్ హీరోయిన్స్ గా మారుతున్నారు.
వారిని కూడా దాటుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టమైన పని. ఇక సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి హీరోయిన్స్ గ్లామర్ డోస్ లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల మొదటిసారి లిమిట్స్ దాటేసి లిప్ లాక్ లో కనిపించడంతో ఆమె దశ తిరిగిపోయింది.

సమంతకు పోటీగా..
ప్రేమమ్ అనే మలయాళం సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత చాలా తొందరగానే తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చేసింది. త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన అఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఒక విధంగా అందులో మేయిన్ హీరోయిన్ గా సమంతా నటించినప్పటికీ అనుపమ గడసరి తెలుగు అమ్మాయిగా చాలా ఆకట్టుకుంది అనే చెప్పాలి.

అప్పట్లో రిజెక్ట్ చేసిన అనుపమ..
అనుపమ పరమేశ్వరన్ కు అఆ సినిమా తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. ఇక అందులో కొన్ని రొమాంటిక్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉన్న సినిమాలను చాలా ఈజీగా రిజెక్ట్ చేసింది. ముఖ్యంగా శతమానం భవతి హిట్ అయిన తర్వాత అనుపమ చాలా తెలివిగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి.

మొదటి లిప్ లాక్
ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. ట్రైలర్ లోనే అనుపమ లిప్ లాక్ సీన్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో కాస్త రొమాంటిక్ గా ఉండే సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం లిప్ లాక్ సీన్ తో పాటు కాస్త హాట్ గా కనిపించడం తో ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

అదే మేజర్ ప్రమోషన్
దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు అయినటువంటి ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిఫరెంట్ టాక్ తో ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్ ఉంది అనే బజ్ సినిమాకు మంచి ప్రమోషన్ వచ్చేలా చేసింది.

కెరీర్ లో అత్యధిక రెమ్యునరేషన్
ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ దాదాపు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఇటీవల ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఒక విధంగా ఆమె కెరీర్ లోనే అత్యధిక పారితోషికం అని కూడా చెప్పవచ్చు. గతంలో కోటి కంటే తక్కువగానే తీసుకున్న ఆమె రౌడీ బాయ్స్ సినిమాలో కాస్త రొమాంటిక్ గా కనిపించడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది.

మరికొన్ని బిగ్ ఆఫర్స్?
అయితే ఈ లిప్ లాక్ సీన్ అనంతరం అనుపమ పరమేశ్వరన్ కు దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. అంతే కాకుండా ఒక స్టార్ హీరోతో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిప్ లాక్ సన్నివేశంతో కుర్రకారు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుపమ ఇప్పటి నుంచి మళ్లీ అలాంటి రోల్స్ చేస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఈ బ్యూటీ ఏ విధంగా దర్శనమిస్తుందో చూడాలి.