అనుపమ పరమేశ్వరన్ లో ఊహించని టాలెంట్.. సినీ ప్రముఖులే ఆశ్చర్యపోయే వర్క్!

యంగ్ ఏజ్ లోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో స్కూల్ విద్యార్థినిగా నటించి ఆకట్టుకున్న ఈ బ్యూటి తెలుగులోనూ అలరించింది. అఆ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ కేరళ కుట్టి తర్వాతి కాలంలో యూత్ కు క్రష్ గా మారింది.

ఇటీవల కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం డీజే టిల్లు 2లో నటిస్తోంది. అయితే ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించే ఈ బ్యూటీలో మరో టాలెంట్ దాగి ఉంది. ఎవరికీ తెలియని ఆ సీక్రెట్ టాలెంట్ ను తాజాగా బయటపెట్టి ప్రశంసలు అందుకుంటుంది.

Anupama Parameswaran As Cinematographer For I Miss You Short Film

ఒప్పేసుకున్న బ్యూటి: నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా చేసిన అఆ సినిమా తర్వాత అక్కినేని నట వారసుడు నాగ చైతన్య 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్‌గా మారింది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో చేసిన క్యారెక్టర్ నే తెలుగులో కూడా చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ తర్వాత అనుపమకు తెలుగులో వరుసగా క్యూ కట్టాయి. వెనువెంటనే ఆఫర్లు రావడంతో సినిమాలు ఒప్పేసుకుంది ఈ బ్యూటి.

దక్షిణాదిలో: మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుసగా శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురూ ప్రేమకోసమే, రాక్షసుడు, కురుప్, రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై, వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇలా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసి తనదైన ముద్ర వేసుకుది.

Anupama Parameswaran As Cinematographer For I Miss You Short Film

షార్ట్ ఫిల్మ్ కు: సినిమాల్లో నటించి మంటి నటిగా పేరు తెచ్చుకున్న క్యూట్ బ్యూటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా సినిమాటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. తనలో మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ ఉందని 'ఐ మిస్ యు' (I Miss You) అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నిరూపించుకుంది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ తో డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మారి ఆశ్చర్యపరిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ కు మరో సినిమాటోగ్రాఫర్ గా రీతి గుప్తా పని చేశారు.

వీడియో కాల్ షార్ట్స్: 'ఐ మిస్ యు' షార్ట్ ఫిల్మ్ కు సినిమాటోగ్రాఫర్ గానే కాకుండా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు కూడా నిర్వహించింది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. అమెరికాలో ఉండే ఓ యువకుడు, అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉంటే వారి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. దీనిలో కొన్ని షార్ట్స్ వీడియో కాల్ లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి.

Anupama Parameswaran As Cinematographer For I Miss You Short Film

బటర్ ఫ్లై హీరో: అయితే 'ఐ మిస్ యు' షార్ట్ ఫిల్మ్ కు అనుపమ పరమేశ్వరన్ అందించిన సినిమాటోగ్రపీకి ప్రస్తుతం ప్రశంసలు దక్కుతున్నాయి. అనుపమ కెమెరా వర్క్ కు వస్తున్న రెస్పాన్స్ తో ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని సినీ ప్రముఖులే ఆశ్చర్యపోయేలా చేసిందని టాక్. ఇక 10 నిమిషాలు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై మూవీ హీరో లీడ్ రోల్ పోషించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X