బట్టలంటే గిట్టదంట.. ఆ ఫోటోలను షేర్ చేసిన స్టార్ హీరోయిన్

ప్రేమమ్ సినిమాలో మెరిసిన అనుపమా పరమేశ్వరణ్.. తెలుగు ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అఆ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చి అందర్నీ మెప్పించింది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే ఈ మలయాళి భామ.. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగానే ఉంటుంది.

చీరకట్టులో అచ్చ తెలుగమ్మాయిలా..

చీరకట్టులో అచ్చ తెలుగమ్మాయిలా..

చీరకడితే అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే అనుపమా పరమేశ్వరణ్‌కు భారీగానే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ పాత్రలకు దూరంగా ఉండే అనుపమా.. టాలీవుడ్ ఆడియెన్స్‌ను అందంతోనే కట్టిపడేసింది.

కలిసి రాని అదృష్టం..

కలిసి రాని అదృష్టం..

అందం, ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఈ సుందరికి. రామ్‌తో చేసిన ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు ఆశించినంతగా ఆడకపోయేసరికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సాయి ధరమ్ తేజ్‌తో చేసిన తేజ్ ఐ లవ్ యూ కూడా బెడిసి కొట్టేసింది. శతమానం భవతి ఒక్కటే చెప్పుకోదగ్గ చిత్రంగా మిగిలిపోయింది.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయత్నాలు..

కేవలం నటిగానే కాకుండా సింగర్‌గానూ తన గాత్రాన్ని అందరికీ పరిచయం చేసింది. అనతి కాలంలోనే తెలుగులో డబ్బింగ్ చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేసింది. అంతేకాకుండా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించబోతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గానూ నైపుణ్యాన్ని పెంచుకుంటోంది. ఓ మలయాళి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది.

బట్టలంటే గిట్టదు..

బట్టలంటే గిట్టదని చిన్న నాటి ఫోటోలను షేర్ చేసింది అనుపమా పరమేశ్వరన్. అనుపమా తండ్రి పరమేశ్వరన్ రెక్కెత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తీసిన చిన్న నాటి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉన్న క్యూట్ అనుపమను నెటిజన్లు ముద్దులతో ముంచేస్తున్నారు. తండ్రితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ తెగ మురిసిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X