twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజానికి సమంత స్థానంలో అనుపమ ఉండాల్సింది.. కానీ ఆ కారణంగా!

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంత కాంబినేషన్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది.

    అంతేకాదు, ఈ సినిమాలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే సమంత నటనకూ మంచి మార్కులు పడ్డాయి. వీరితో పాటు ఆది పినిశెట్టి, అనసూయ, జబర్థస్త్ మహేశ్ ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. దీంతో ఈ సినిమా టాలీవుడ్ టాప్ చిత్రాల్లో కూడా స్థానం దక్కించుకుంది.

    Anupama Parameswaran Clarity about Rangasthalam Chance

    కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కన్నడంలోకి డబ్ అయింది. 'రంగస్థల' పేరుతో అక్కడ విడుదల చేశారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా.. కన్నడంలోనూ ఆకట్టుకుంది. అక్కడ మెగా అభిమానులు ఎక్కువగా ఉండడంతో పాటు, సినిమాలో కంటెంట్ కూడా బాగుండడంతో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'రంగస్థలం'కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

    ఈ సినిమాలో సమంత చేసిన రామలక్ష్మీ పాత్రకు మొదట అనుపమ పరమేశ్వరన్‌ను అనుకున్నారట. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ అవకాశాన్ని ఆమె కోల్పోయిందట. ఈ విషయాన్ని అనుపమనే స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'రాక్షసుడు' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనుపమ ఈ విషయాన్ని వెల్లడించింది.

    'రంగస్థలం' గురించి మాట్లాడుతూ.. ''మొదట 'రంగస్థలం'లో నటించే అవకాశం నాకే వచ్చింది. అయితే, అప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. దీంతో డేట్లు సర్ధుబాటు చేయలేకపోయాను. ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. అయితే, సినిమా చూసిన తర్వాత ఇందులో నేను చేయకపోవడమే మంచిదని అనిపించింది. రామలక్ష్మి పాత్రలో సమంత అంత బాగా నటించింది. నేనలా చేసేదాన్నో కాదో చెప్పలేను'' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Anupama Parameshwaran is one of those actresses who enjoy good craze among the audiences. But, she did not get the chance to romance with top stars on the screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X