అర్ధరాత్రి 2 గంటలైనా అతనే కావాలి... హీరో కొడుకుతో రిలేషన్‌పై తేల్చేసిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కొత్త ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఆల్రెడీ ప్రేమాయణం సాగిస్తున్న వారు తమ ప్రేమికులతో పెళ్లి పీటలెక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే రష్మిక మందన్న - విజయ్ దేవరకొండలు ఫిబ్రవరి 26న.. అల్లు శిరీష్ - నయనిక రెడ్డిలు మార్చి 6వ తేదీన వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తూ.. వాటిని బయటపెట్టడానికి సమయం కోసం వేచిచూస్తున్నారు. మరికొందరైతే ప్రేమలో ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఈ కోవలోకే వస్తారు హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఓ స్టార్ హీరో కొడుకుతో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై పబ్లిక్‌గా స్పందించారు అనుపమ. ఈ వివరాల్లోకి వెళితే..

మలయాళ ఇండస్ట్రీ ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్. అక్కడ స్టార్‌గా దూసుకుపోతున్న దశలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన అ ఆ చిత్రంతో తెలుగువారిని పలకరించారు అనుపమ పరమేశ్వరన్. లంగా ఓణీలో పదహారు అణాల తెలుగు అమ్మాయిలా ఆ సినిమాలో నటించి కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హాలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే అనూహ్యంగా తెలుగు తెరకు దూరమైన అనుపమ...కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీ అయ్యింది.

Anupama Parameswaran- Dhruv Vikram Relation Acterss Reacts to Dating Rumours with Bison co star

2022లో రౌడీ బాయ్స్‌తో తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యారు. అంటే సుదరానికీ, కార్తీకేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై, ఈగల్, టిల్లు స్క్వేర్, పరదా, కిష్కింధపురి తదితర చిత్రాల్లో దుమ్మురేపింది. కెరీర్‌ తొలినాళ్లలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే చేసిన అనుపమ.. ఇటీవల మాత్రం హద్దులు దాటేసింది. అవసరమైతే రొమాంటిక్ సీన్స్‌కు కూడా రెడీ అని తేల్చేసింది. పలు చిత్రాల్లో లిప్‌లాక్స్‌తో సెగలు రేపింది. ఈ ఏడాది లాక్‌డౌన్ అనే తమిళ చిత్రంలో నటించిన అనుపమ.. మళ్లీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

అందరు హీరోయిన్ల మాదిరిగానే అనుపమ పరమేశ్వరన్‌ పైనా రకరకాల రూమర్స్ వచ్చాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, శర్వానంద్, చిరంజీవ్ మక్వానాలతో అనుపమ ప్రేమాయణం సాగించినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గత కొద్దిరోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ బైసన్ అనే మూవీలో జంటగా నటించారు. ఇదే సమయంలో అనుపమకు ధ్రువ్ ఘాటు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి డేటింగ్ వార్తలకు ఈ ఫోటో మరింత బలాన్ని చేకూర్చింది.

తాజాగా ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ధ్రువ్‌తో తన రిలేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అనుపమ పరమేశ్వరన్. ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ- ధ్రువ్ విక్రమ్‌లు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఇదే వేదికపై అనుపమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ధ్రువ్. ఆ సమయంలో పక్కనే ఉన్న యాంకర్ ఓ ప్రశ్న వేసింది. మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఎవరికైనా వీడియో కాల్ చేయాలంటే ఎవరికి చేస్తారని ప్రశ్నించింది. దానికి ఏమాత్రం తడబడకుండా ధ్రువ్‌కు కాల్ చేస్తానని అనుపమ ఆన్సర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X