Anupama Parameswaran: అనుపమ ఫోటోలు మార్పింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Anupama Parameswaran: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఆన్‌లైన్ వేధింపులకు గురైంది. ఈ విషయంపై కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఘటనను బహిర్గతం చేస్తూ, సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని వెల్లడించింది. ఇంతకీ అనుపమ జరిగిన అన్యాయం ఏంటీ? ఆమె పోస్ట్ చేసిన ప్రకటన వెల్లడించిన వివరాలేంటీ? ఇంతకీ ఏం జరిగింది?
నటి అనుపమ పరమేశ్వరన్ ఆన్‌లైన్ వేధింపుల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ షేర్ చేస్తూ, ఒక యువతి తనపై తప్పుడు ప్రచారం చేస్తూ, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడిందని వెల్లడించారు. ఆమె తెలిపిన ప్రకారం.. ఈ ఘటనపై ఇప్పటికే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల ఓ యువతి తనను ఆన్‌లైన్ వేధింపులకు గురి చేసిందని తేలడంతో అనుపమ ఆశ్చర్యానికి గురయ్యారు.

అనుపమ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో తన గురించి, కుటుంబం, స్నేహితులు, సహనటుల గురించి అసత్యమైన పోస్టులు చేస్తూ, మార్ఫింగ్ ఫోటోలు పంచుతోందని గుర్తించారట. "ఆ పోస్టుల్లో నిరాధారమైన ఆరోపణలు, అసభ్యమైన వ్యాఖ్యలు ఉండేవి. అలా నిరంతరం టార్గెట్ చేస్తూ వేధించడం నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది" అని ఆమె తెలిపింది.
దర్యాప్తు తరువాత తెలిసిందేమిటంటే.. అదే వ్యక్తి అనేక ఫేక్ అకౌంట్లు సృష్టించి ద్వేషపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూర్వక పోస్టులు చేస్తూ తనను నిరంతరం అవమానపరిచే ప్రయత్నం చేసిందని నటి అనుపమ వివరించారు. ఈ వేధింపులకు పాల్పడింది 20 ఏళ్ల అమ్మాయి అనీ, దీంతో ఆమె పేరును బయటపెట్టకూడదని అనుపమ నిర్ణయించుకున్నారు. అయితే," ఆ అమ్మాయిని సిగ్గుపడేలా చేయాలనేది నా ఉద్దేశం కాదు. కానీ, చట్టపరమైన చర్య తప్పదని స్పష్టం చేయాలనుకుంటున్నా. ఈ రకమైన సైబర్ వేధింపులు సరదా విషయాలు కావు. ఇవి శిక్షార్హమైన నేరాలు" అని ఘాటుగా హెచ్చరించారు.
అనుపమ తన ప్రకటనలో ఇంకా రాస్తూ, "స్మార్ట్‌ఫోన్ వాడుతున్నామన్న కారణంగా లేదా సోషల్ మీడియాలో అకౌంట్ ఉందని చెప్పి ఎవరికీ ఇతరులను అవమానించే హక్కు లేదు. ప్రతి ఆన్‌లైన్ చర్య ఒక జాడను వదిలివేస్తుంది. ఆ జాడ ఎప్పుడో ఒకప్పుడు చట్టం ముందు నిలుస్తుంది" అని హెచ్చరించారు. అనుపమ తెలిపిన ప్రకారం.. ఆ యువతిపై చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. "పబ్లిక్ ఫిగర్ అయినా తన లాంటి వారికి కూడా మానవ హక్కులు ఉన్నాయి. సైబర్ వేధింపులు అంటే చిన్న విషయం కాదు, దానికి శిక్ష తప్పదు" అని అనుపమ వ్యాఖ్యానించారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు అనుపమకు మద్దతుగా నిలుస్తూ, ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. "ఇలాంటి దాడులకు చట్టపరంగా ఎదురుతిరగడం సమాజానికి ఒక మంచి సందేశం" అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఇక అనుపమ కెరీర్ విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు భాషల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఈ అమ్మడు తమిళంలో డ్రాగన్, బైసన్ కాలమాడన్, తెలుగులో పరదా, కిష్కింధపురి, మలయాళంలో జేఎస్కే: జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్ చిత్రాల్లో నటించారు. త్వరలో ఆమె నటించిన లాక్‌డౌన్ (తమిళ్)మూవీ విడుదల కానుంది. మొత్తానికి, అనుపమ పరమేశ్వరన్ వ్యవహరం చర్చనీయంగా మారింది.


Click it and Unblock the Notifications











