హీరోయిన్ ఫోటోలు మార్ఫింగ్.. మీకు అక్కా చెల్లెళ్లు లేరా.. మీ బుద్ధిని మంచికి వాడండి!!
మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరణ్‌కు కోపం వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ కూల్‌గా ఉండే అనుపమా.. రీసెంట్‌గా సీరియస్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం, ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై ఈ అమ్మడు విరుచుకుపడింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే కేరళ బ్యూటీ.. హ్యాక్ అయిన విషయాన్ని త్వరగానే పసిగట్టి జాగ్రత్త పడింది. అయితే హ్యాకర్స్‌పై మాత్రం అంత ఎత్తున లేచింది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

హోమ్లీ క్యారెక్టర్స్‌తో..
అ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ అందం అనుపమ. ప్రేమమ్ సినిమాతో అక్కడి కుర్రకారు హృదయాన్ని కొల్లగొట్టిన అనుపమా.. అఆ సినిమాతో టాలీవుడ్‌కు దగ్గరైంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు.

కలిసిరాని అదృష్టం..
అనుపమకు కావాల్సినంత అందం ఉండి, ప్రతిభ ఉన్నా కూడ అదృష్టం మాత్రం లేదనిపిస్తోంది. కొన్ని సినిమాలు హిట్ అయిన పేరు రాకపోవడం, మరికొన్ని సినిమాల్లో అనుపమకు పేరు వచ్చినా.. ఆడకపోవడంతో కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫౌలో నడుస్తోంది. అనుపమా చివరగా కనిపించింది హలో గురు ప్రేమ కోసమే చిత్రంలోనే. ఆపై మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..
అయితే వెండితెరపై అంతగా ఆకట్టుకోలేకపోతోన్న అనుపమా.. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. సంప్రదాయ బద్దమైన దుస్తులనే ధరిస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటుంది.
Recommended Video

ఖాతాలు హ్యాక్, ఫోటోలు మార్పింగ్..
తన ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.. గమనించండని ఫ్యాన్స్‌కు సూచించింది. ఇక తన ఫోటోలను మార్ఫింగ్ చేయడం అనుపమా ఫైర్ అవుతు.. ‘ఇలాంటి చెత్త పనులు చేసేందుకు సమయాన్ని కేటాయించిన వారి ఇంట్లో అమ్మ, అక్కా చెల్లి లేరా? ఇలాంటి పనులు చేసేకంటే మంచి వాటికి మీ బుర్రను వాడండి.. కేవలం క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ చేశా' అంటూ శివాలెత్తింది.


Click it and Unblock the Notifications











