6 నెలలు నరకం.. రంగస్థలం ట్రోల్‌పై అనుపమా పరమేశ్వరన్ క్లారిటీ
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుపమా పరమేశ్వరన్ ఆ క్రేజ్ తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2015 నుంచి చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఇప్పటి వరకు 10 ఏళ్ల కెరీర్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ పరదాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో జోరుగా సందడి చేసింది. ఈ క్రమంలో అనుపమా కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకుంది. ఈ క్రమంలోనే అనుపమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. అయితే ఆ చిత్రంలో తను నటించకపోవడానికి కారణం ఏంటనే విషయాన్ని అనుపమా పరమేశ్వరన్ తాజాగా వెల్లడించింది. పైగా ఆ సినిమా రిలీజ్ సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ ద్వారా ఎలాంటి సమస్యలను ఎదుర్కుందో కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

అయితే అనుపమా పరమేశ్వరన్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రంగస్థలం ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించి మెపించింది. కాగా రంగస్థలం చిత్రంలో సమంత కంటే ముందే హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ కు అవకాశం వచ్చిందంట. కానీ కొన్ని కారణాలతో తనకు బదులుగా సమంత రూత్ ప్రభును తీసుకున్నారని చెప్పింది. అసలు విషయం ఇదైతే చాలా వరకు తనే రామ్ చరణ్ రంగస్థలం సినిమాను రిజెక్ట్ ను చేశానని ప్రచారం చేశారని తెలిపింది.
అలా ప్రచారం జరగడంతో తనకు 6 నెలల పాటు సినిమాలు లేవని, ఎలాంటి ఉద్యోగం లేక ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకొచ్చినట్టు అనుపమా పరమేశ్వరన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తన ప్రమేయం లేకుండానే ఇలా ట్రోల్ కు గురైనట్టు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రంగస్థలం చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.216 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయడం విశేషం.
ఇక అనుపమా పరమేశ్వరన్ రీసెంట్ గా పరదా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.2 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక అంతకు ముందు అనుపమా పరమేశ్వరన్ కార్తీకేయ 2, డ్రాగన్ వంటి చిత్రాలతో సక్సెస్ ను అందుకుంది.


Click it and Unblock the Notifications











