యువ హీరో సరసన అనుపమ పరమేశ్వరన్!
బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోతున్నాయనే విమర్శ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం శ్రీనివాస్ తేజ దర్శత్వంలో సీత చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం తర్వాత తమిళ సూపర్ హిట్ మూవీ రాట్సాసన్ రీమేక్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించేందుకు రాశి ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ రాశి ఖన్నా ఈ చిత్రంలో నటించడం లేదని తెలుస్తోంది. మలయాళీ క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో నటించేందుకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాట్సాసన్ తమిళంలో ఘనవిజయం సాధించితిన్ థ్రిల్లర్ మూవీ. విష్ణు విశాల్ హీరోగా నటించాడు.

రైడ్ ఫేమ్ రమేష్ వర్మ రాట్సాసన్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ స్కూల్ టీచర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అనుపమ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications