Don't Miss!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- News
Vastu tips: వంటగదికి ఆరోగ్యానికి లింక్.. కిచెన్ వాస్తు ఏం చెప్తుందంటే!!
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అక్కడ టాటూ వేయించుకున్న అనుపమ పరమేశ్వరన్: కొంగుచాటు అందాలతో హాట్ గా!
అందం, అభినయంతో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది ఈ భామ. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో మరోసారి నిఖిల్ సిద్ధార్త్ తో 18 పేజీస్ సినిమాలో జోడి కట్టనుంది. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న క్యూట్ బ్యూటి మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తోంది. తాజాగా ఆ పార్ట్ పై టాటూ వేసుకుని మరింత హాట్ గా దర్శనమిచ్చింది ఈ క్యూట్ బ్యూటి.

చదువు తర్వాత సినిమా ప్రయత్నాలు..
బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుండలో పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. 1996 ఫిబ్రవరి 18న పుట్టిన ఈ కేరళ బ్యూటి ప్రాథమిక విద్య తర్వాత కొట్టాయం సీఎంఎస్ కాలేజ్ లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చదువు పూర్తి చేసింది. అనంతరం సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది మలయాళ ముద్దుగుమ్మ.

అనుపమ నటనకు అట్రాక్ట్..
చదువు తర్వాత అతి చిన్న వయసులోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో నటించింది. ఇందులో మేరీ జార్జ్ అనే పాత్ర ద్వారా అనుపమ పరమేశ్వరన్ కు మంచి పాపులారిటీ లభించింది. ఆ తర్వాత మలయాళంలో మరో చిత్రంలోనూ అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే అనుపమ నటనకు అట్రాక్ట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాలో అవకాశం ఇచ్చారు.

నాగ చైతన్య సినిమాతో హీరోయిన్ గా..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది క్యూట్ ఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అనంతరం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య తెలుగులో నటించిన 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించింది.

తమిళ రీమేక్ మూవీతో హిట్టు..
అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో చేసిన సినిమాలు చాలా తక్కువే. అయినా విపరీతంగా ఫేమస్ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్. నితిన్ హీరోగా నటించిన 'అఆ', శతమానం భవతి తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జోడి కట్టింది. ఈ సినిమా తమిళ చిత్రం రాట్ససన్ కు రీమెక్ గా వచ్చి సూపర్ హిట్ సాధించింది.

సడెన్ గా అలా చేయడంతో..
ఇదిలా ఉంటే రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఘాటు ముద్దు సీన్లలో నటించి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ అభిమానులు మాత్రం కొంత నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే మొదటి నుంచి సినిమాల్లో గ్లామర్ షో చేయని అనుపమ పరమేశ్వరన్ సడన్ గా ఇలా ముద్దు సీన్లు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సరికి తీసుకోలేకపోయారు. అలాగే ఈ సినిమాలో అనుప పరమేశ్వరన్ అధిక చుంబనాలతో విమర్శల పాలు కూడా అయింది.

ఆ సినిమా నుంచి తప్పుకున్న బ్యూటి..
ఇక ప్రస్తుతం తమిళంలో 'తల్లి పొగతే' అనే మూవీ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. అలాగే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ సరసన '18 పేజీస్' సినిమాతో మరోసారి జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ కేరళ కుట్టి. అలాగే 'బటర్‌ఫ్లై' అనే సినిమాలోనూ కూడా నటిస్తోంది ఈ భా. ఇటీవల సిద్ధు జొన్నల గడ్డ డీజే టిల్లు సీక్వెల్ మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకున్న విషయం తెలిసిందే..

కొంగుచాటు అందాలతో..
సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ పాపుర్ అవుతోంది. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్న ఫొటోలు కూడా వదులుతోంది ఈ బ్యూటి. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది ఈ క్యూట్ భామ. బ్లాక్ సారీ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఎద భాగంపై టాటూను వేయించుకుంది. ఆమె ఎద భాగంపై ఉన్న టాటూ ఆకట్టుకోగా స్మైలింగ్ ఫేస్ తో అట్రాక్ట్ చేస్తోంది అనుపమ. అలాగే ఆ చీరలో అనుపమ కోంగుచాటు అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.