వ్యాక్సిన్ వేయించుకున్న అనుపమ పరమేశ్వరన్.. ఎంత ముద్దుగా ఉందొ..
మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులో బలంగా తనకంటూ ఒక ముద్ర వేసేసుకుంది. గ్లామర్ డోస్ ఏ మాత్రం పెంచకుండా కేవలం తన చిరునవ్వుతోనే ఎట్రాక్ట్ చేసింది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ కథలో తన పాత్ర కూడా చాలా కీలకం అవ్వాలని చూసుకునే అతికొద్ది మంది హీరోయిన్స్ లలో అనుపమ ఒకరు. అఆ సినిమా నుంచి అలానే వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుకుంటోంది.
సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ సోషల్ మిడియాతోనే సగం క్రేజ్ అందుకుంటున్నారు. సినిమాలున్నా లేకపోయినా కూడా హాట్ ఫొటోస్ అప్లోడ్ చేసి కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే అనుపమ మాత్రం అలా కాకుండా సింపుల్ ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మాస్క్ వేసుకొని రింగుల జుట్టుతో అనుపమ చాలా ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది హీరోయిన్స్ వ్యాక్సిన్ వేయించుకోవాడానికి కూడా గ్లామర్ లుక్స్ తో బిల్డప్ ఇస్తుంటే ఈ మలయాళం బ్యూటీ మాత్రం సింపుల్ గా దర్శనమివ్వడం వైరల్ గా మారింది. ఇక తెలుగులో చివరగా రాక్షసుడు సినిమాతో సక్సెస్ అందుకున్న అనుపమ ప్రస్తుతం నిఖీల్ 18 పేజెస్ లో నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న ఆ సినిమాపై అంచనలు గట్టిగానే ఉన్నాయి. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











