ఆనందంలో అనుపమా.. 70 లక్షల అభిమాన గణం!!

కేరళ కుట్టి, మలయాళి బొమ్మ అనుపమా పరమేశ్వరణ్.. తెలుగు ప్రేక్షకులకు ఇట్టే కట్టిపడేసింది. అసలైతే తెలుగులో ఒక్క చిత్రం కూడా చేయకముందే.. ఇక్కడ ఫేమస్ అయింది. మలయాళీ చిత్రం ప్రేమమ్ ఇక్కడ కూడా తెగ వైరల్ అయింది. భాష అర్థం కాకపోయినా ప్రేమమ్ చిత్రాన్ని యూత్‌ను బాగానే ఆకర్షించింది. అందుకు కోరి మరి ఇక్కడ రీమేక్ చేశారు. అలా అనుపమ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి తెలుగు ప్రేక్షకులనూ ప్రతీసారి కట్టి పడేస్తూనే వచ్చింది.

హెమ్లీ పాత్రలకు పెట్టింది పేరులా అనుపమా చక్కగా సరిపోయేది. గ్లామర్ షో, స్కిన్ షోలకు పోకుండా పక్కింటి అమ్మాయిలా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. అయితే అనుపమకు సరైన హిట్ మాత్రం లభించలేదు. అందుకే ఈ మధ్య కెరీర్ కాస్త డల్ అయింది. అనుపమా మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతూ ఉంటుంది. అనుపమకు ఒకప్పుడు డబ్ స్మాష్ అంటే పిచ్చి ఉండేది. ఆపై ఆ స్థానాన్ని టిక్ టాక్ ఆక్రమించింది.

 Anupama Parameswaran Instagram Reach 7 million Followers

అలా నిత్యం ఏదో ఒక వీడియోలను షేర్ చేస్తూ తెగ బిజీగా ఉండేది. సంప్రదాయ దుస్తుల్లో అనుపమ షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమకు తాజాగా డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏడు మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో అనుపమా ఆనందంలో తేలిపోతోంది. ఈ మేరకు తన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఇలాగే తనకు సపోర్ట్ చేస్తూ ఉండండని ఐ లవ్యూ అని చెప్పి ఓ ముద్దు కూడా విసిరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X