గ్లామర్ డోస్ పేంచేసిన అనుపమ పరమేశ్వరన్.. ఓవైపు నవ్వుతూనే మరోవైపు అలా!

అందం, అభినయంతో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది ఈ భామ. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ సుందరి అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా సౌత్ ఇండియాలోనే ఫేమస్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న క్యూట్ బ్యూటి మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అభిమానులకు ఐ ట్రీట్ ఇస్తోంది.

కేరళలోని త్రిస్సూర్ లో..

కేరళలోని త్రిస్సూర్ లో..

బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుండలో పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. 1996 ఫిబ్రవరి 18న పుట్టిన ఈ కేరళ బ్యూటి ప్రాథమిక విద్య తర్వాత కొట్టాయం సీఎంఎస్ కాలేజ్ లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చదువు పూర్తి చేసింది. అనంతరం సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది మలయాళ ముద్దుగుమ్మ.

మేరీ జార్జ్ పాత్రతో గుర్తింపు..

మేరీ జార్జ్ పాత్రతో గుర్తింపు..

చదువు తర్వాత వెరీ యంగ్ ఏజ్ లోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో నటించింది. ఇందులో మేరీ జార్జ్ అనే పాత్ర ద్వారా అనుపమ పరమేశ్వరన్ మంచి పాపులారిటీ లభించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎంటరైంది.

ఆ సినిమాతో మంచి గుర్తింపు..

ఆ సినిమాతో మంచి గుర్తింపు..

త్రివిక్రమ్ అఆ సినిమా తర్వాత అక్కినేని నట వారసుడు నాగ చైతన్య తెలుగులో నటించిన 'ప్రేమమ్' చిత్రంతో హీరోయిన్‌గా మారింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించింది. దీంతో అనుపమకు కూడా మంచి పేరు వచ్చింది.

రాక్షసుడుతో మరో హిట్టు..

రాక్షసుడుతో మరో హిట్టు..

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా విపరీతంగా ఫేమస్ అయిపోయింది. నితిన్ హీరోగా నటించిన 'అఆ', శతమానం భవతి తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జోడి కట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇలా ఈ మధ్య కాలంలోనే ఆమె 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో వచ్చింది.

ముద్దు సీన్లతో విమర్శలు..

ముద్దు సీన్లతో విమర్శలు..

రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఘాటు ముద్దు సీన్లలో నటించి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ అభిమానులు మాత్రం కొంత నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే మొదటి నుంచి సినిమాల్లో గ్లామర్ షో చేయని అనుపమ పరమేశ్వరన్ సడన్ గా ఇలా ముద్దు సీన్లు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సరికి తీసుకోలేకపోయారు. అలాగే ఈ సినిమాలో అనుప పరమేశ్వరన్ అధిక చుంబనాలతో విమర్శల పాలు కూడా అయింది.

మరోసారి నిఖిల్ కు జోడిగా..

మరోసారి నిఖిల్ కు జోడిగా..

ఇక ప్రస్తుతం తమిళంలో 'తల్లి పొగతే' అనే మూవీ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. అలాగే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ సరసన '18 పేజెస్' సినిమాతో మరోసారి జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల వీరిద్దరు కలిసి నటించిన 'కార్తికేయ 2'లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ కేరళ కుట్టి. అలాగే 'బటర్‌ఫ్లై' అనే సినిమాలోనూ కూడా నటిస్తోంది ఈ భా.

రొమాంటిక్ పోజులతో..

రొమాంటిక్ పోజులతో..

సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ పాపుర్ అవుతోంది. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్న ఫొటోలు కూడా వదులుతోంది ఈ బ్యూటి. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది ఈ క్యూట్ భామ. బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో తన షోల్డర్ అందాలను హాట్ గా ప్రదర్శించింది. అలాగే స్మైలింగ్ తో రొమాంటిక్ పోజులిస్తూ గ్లామర్ డోస్ పెంచేసింది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X