Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ షో.. ఇలా ఎప్పుడు చూసుండరు!
చూపు తిప్పుకోనివ్వకుండా చేయగల అందం, మత్తెక్కేలా చూసే అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది మలయాళ బ్యూటి అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా సౌత్ ఇండియాలోనే ఫేమస్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

'అఆ' సినిమాతో తెలుగులోకి..
యంగ్ ఏజ్ లోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ కనిపించింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత అక్కినేని నట వారసుడు నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి వాటిలో చేసింది.

పెద్దగా సక్సెస్ తేని రౌడీ బాయ్స్..
అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా విపరీతంగా ఫేమస్ అయిపోయింది. నితిన్ హీరోగా నటించిన 'అఆ' తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జోడి కట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇలా ఈ మధ్య కాలంలోనే ఆమె 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో వచ్చింది. కానీ, ఇది పెద్దగా ఆడలేదు. అయితే, ఆమెకు మాత్రం పేరు తెచ్చింది.

రొమాంటిక్ సన్నివేశాల్లో..
రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఘాటు ముద్దు సీన్లలో నటించి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ అభిమానులు మాత్రం కొంత నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే మొదటి నుంచి సినిమాల్లో గ్లామర్ షో చేయని అనుపమ పరమేశ్వరన్ సడన్ గా ఇలా ముద్దు సీన్లు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సరికి తీసుకోలేకపోయారు. అలాగే ఈ సినిమాలో అనుప పరమేశ్వరన్ చుంబనాలతో విమర్శల పాలు కూడా అయింది.

చిన్న పాత్రలో ఆకట్టుకున్న అనుపమ..
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపింది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ నటించిన 'కురుప్' సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ఇందులో చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది.

నిఖిల్ తో కార్తికేయ 2లో..
ప్రస్తుతం తమిళంలో 'తల్లి పొగతే' అనే మూవీలో చేస్తోంది. అలాగే అనుపమ పరమేశ్వరన్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆమె తెలుగులో నిఖిల్ '18 పేజెస్'లోనూ నటిస్తోంది. ఇటీవల సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా వచ్చిన 'కార్తికేయ 2'లో నటించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే, 'బటర్‌ఫ్లై' అనే సినిమాలోనూ ఈ చిన్నది భాగం అయింది.

ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్న ముద్దుగుమ్మ..
వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది. అలాగే హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

మరోసారి హాట్ ప్రదర్శన..
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హాట్ ప్రదర్శన చేసింది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. యెల్లో కలర్ టాప్ ధరించిన అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ పెంచి తన షోల్డర్ అందాలను ప్రదర్శించింది. తన అందమైన స్మైల్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నిమ్మపండులా మెరుస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు అతి కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











