Anupama Parameswaran: ఏకంగా టాటూ కనిపించేలా అనుపమ బీభత్సం.. హీటెక్కించే లుక్

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వచ్చిన కొత్తలో ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ బ్యూటీ రోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు తను నిజంగా అనుపమనేనా అనే విధంగా షాక్ ఇస్తోంది. ఈ మధ్య వెండితెరపై బోల్డ్ సీన్స్ లో కూడా షాక్ ఇస్తోంది. అయితే అనుపమ సోషల్ మీడియాలో కూడా రోజు రోజుకు డోస్ మరింత పెంచుతోంది. ఈసారి టాటూ కనిపించేలా మరో హీటెక్కించే స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

అలా కొనసాగిన కెరీర్:టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ మల్లు బ్యూటీ ప్రేమమ్ సినిమాతో మలయాళంలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుపమని అఆ సినిమాతో పరిచయం చేశాడు. ఈ మూవీ సక్సెస్ కావడంతో తరువాత శతమానం భవతి మూవీలో ఫుల్ లెంత్ హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కొట్టింది.

Anupama Parameswaran new glamorous look viral in social media

ఆ సినిమాల్లో బొద్దుగా..:అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే హలో గురు ప్రేమ కోసమే, తేజ్ ఐ లవ్ యు సినిమాలలో అనుపమ బొద్దుగా కనిపించింది. తరువాత కొంత గ్యాప్ ఇచ్చి భాగా వర్క్ అవుట్ లు చేసి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. ఇక స్లిమ్ గా మారిన అనుపమ మరల రౌడీ బాయ్స్ మూవీతో హాట్ చిక్ గా కుర్రకారు మనసు దోచేసింది.

Anupama Parameswaran new glamorous look viral in social media

అందరి దృష్టి అనుపమపైనే..:ఆ సినిమాలో శృతి మించి బోల్డ్ ఇంటిమేట్ సన్నివేశాలతో పాటు కొత్త హీరోతో కిస్ సీన్ లు కూడా చేసింది. దీంతో ఒక్కసారి అందరి దృష్టి అనుపమపై పడింది. ఈ అమ్మడుకి కళ్ళు, స్మైల్ అందానికి అదనపు ఆకర్షణగా ఉంటాయి. కళ్ళతోనే రొమాన్స్ ని పలికించే హాట్ లుక్స్ అనుపమ సొంతం అందుకే సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Anupama Parameswaran new glamorous look viral in social media

మరోసారి స్టన్ అయ్యేలా గ్లామర్ ట్రీట్:ఈ మధ్య గ్లామర్ డోస్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అమ్మడు అందాల ప్రదర్శన చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకి సెగలు రేపుతోంది. ఆ మధ్య టిల్లు స్క్వేర్ పోస్టర్ లో సిద్దుతో రొమాంటిక్ స్టిల్ తో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇక తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ లో అదిరిపోయే సెల్ఫీ ఫోటోలని అనుపమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

టాటూ కనిలించేలా ఘాటైన స్టిల్:టెంప్ట్ చేసే చూపులతో ఎద అందాలని చూపిస్తూ అనుపమ చెమటలు పట్టిస్తోంది. అలాగే టాటూ కూడా హైలెట్ చేసింది. ఈ ఫోటోలని ఏకంగా 6.47 లక్షల మంది కేవలం రెండు గంటల్లో చూడటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ తో పాటు, రవితేజకి జోడీగా ఈగల్, తమిళంలో జయం రవితో సెరిన్ మూవీలలో నటిస్తోంది. ఈ సినిమాలు అన్ని కూడా షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X