విషాదంలో అనుపమ పరమేశ్వరన్.. ప్రాణాంతక వైరస్‌తో..

దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు విషాదంలో మునిగిపోయారు. తాను ఇష్టంగా పెంచుకొన్న రెండు పెంపుడు కుక్కలను కాపాడుకోలేకపోయాననే బాధను వ్యక్తం చేస్తూ అనుపమ వీడియోను రిలీజ్ చేశారు. గత కొద్దిరోజులుగా మాములు మనిషి కావడానికి ప్రయత్నించినా.. కానీ నా వల్ల కాలేదంటూ తన పెంపుడు కుక్కల విషాదం గురించి తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించింది.

అనుపమ పరమేశ్వరన్‌కు మూడు పెంపుడు కుక్కలు

అనుపమ పరమేశ్వరన్‌కు మూడు పెంపుడు కుక్కలు

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు విస్కీ, రమ్, టాడీ అనే పేర్లతో మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటిని ఆమె ప్రాణం కంటే మిన్నగా చూసుకొంటారు. అయితే ఆ మూడు పెంపుడు కుక్కలు పార్వో వైరస్ అనే వ్యాధికి గురయ్యాయి. ఆ వ్యాధి నుంచి కాపాడటానికి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. అయినా లాభం లేకపోయింది.

ఆ రెండింటిని కాపాడుకోలేకపోయాను..

ఆ రెండింటిని కాపాడుకోలేకపోయాను..

తాజా వీడియోలో అనుపమ విషాదానికి గురైనట్టు కనిపించారు. తన పెంపుడు కుక్కల మరణం గురించి మాట్లాడుతూ.. పార్వో వైరస్‌తో గురైన విస్కీ, రమ్, టాడీని రక్షించుకోవడానికి ప్రయత్నించాను. కానీ పెంపుడు కుక్కలు రెండు ఆ వ్యాధి బారి నుంచి బయటపడలేకపోయాయి. వాటిని కాపాడుకోలేదన్న బాధ నన్ను వెంటాడుతున్నది అని వీడియోలో తన బాధను పంచుకొన్నారు.

 జూన్ 8న ఆ రెండు మరణించాయి.

జూన్ 8న ఆ రెండు మరణించాయి.

తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో తెలిపిన ప్రకారం.. మే 27న టాడీ, రమ్ వైరస్ వ్యాధిన పడ్డాయి. అప్పటి నుంచి ప్రతీ రోజు వాటి గురించి ఆలోచిస్తూ ట్రీట్‌మెంట్ ఇప్పించాను. కానీ వాటిని వైరస్ బారి నుంచి గట్టెక్కించలేకపోయాం. ఆ వ్యాధితో జూన్ 8న మరణించాను. ఆ బాధ నన్ను వెంటాడుతుండటం తీరని విషాదంగా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో కనిపించకుండా పోయాను. నాలాంటి బాధ మరొకరికి ఎదురు కావొద్దనే ఈ వీడియోను చేశాను అని అనుపమ పేర్కొన్నారు.

 విస్కీ ఆరోగ్యం మెరుగుపడటం

విస్కీ ఆరోగ్యం మెరుగుపడటం

రమ్, టాడీ మరణం తర్వాత విస్కీ ఒంటరైపోయింది. అయితే విస్కీ ఆరోగ్యం మెరుగుపడటం కొంత ఉపశమనంగా ఉంది. పార్వో వైరస్ గురించి తెలుసుకొంటున్నాను. పెంపుడు కుక్కలే కాదు మనుషులు కూడా ఎలాంటి వైరస్‌కు గురికావొద్దు. మీ పెంపుడు కుక్కలను జాగ్రత్తగా చూసుకోండి. వాటికి రెగ్యులర్‌గా వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ అనుపమ తన ఇన్స్‌టాపోస్టులో సలహాలు ఇచ్చింది.

Recommended Video

Allu Arjun Plans For Bollywood Movie || యుట్యూబ్ క్రేజ్ ని నమ్ముకుంటున్న బన్నీ!!
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఇలా..

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఇలా..

ప్రేమమ్ మలయాళ, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ తనదైన శైలిలో రాణిస్తున్నారు. అఆ, కోడి, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మనియారాయిలే అశోకన్ అనే మలయాళం చిత్రంలో, థాలీ పొదతే అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X