బట్టలు కొనలేని స్థితిలో స్టార్ హీరోయిన్.. చొక్కా, ప్యాంటు దొంగతనం చేసి
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో మలయాళ ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో కేరళ కుట్టిలు తెలుగు తెరను ఏలుతున్నారు. ప్రస్తుతం నిత్య మీనన్, సంయుక్త మీనన్, కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, మాళవిక మీనన్, ఐశ్వర్య మీనన్ తదితరులు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. ఇక ఈ కోవలోకే వస్తారు అనుపమ పరమేశ్వరన్.
18 ఫిబ్రవరి 1996న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జన్మించారు అనుపమ. స్థానికంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనుపమ .. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో చేరారు. అయితే మధ్యలో సినిమాల్లో అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. 2015లో వచ్చిన ప్రేమమ్‌తో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో నటనకు గాను మంచి మార్కులు కొట్టేసిన ఆమెకు ఆ తర్వాత వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ - సమంత నటించిన అఆ ద్వారా తెలుగు వారిని పలకరించారు అనుపమ. అందులో పల్లెటూరి పిల్లగా , పదహారు అణాల తెలుగు అమ్మాయిగా లంగావోణిలో అలరించారు . ఆ తర్వాత ప్రేమమ్ తెలుగు రీమేక్‌లోనూ నటించి మెప్పించారు. అనంతరం శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హాలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు , రౌడీ బాయ్స్ , కార్తీకేయ 2, 18పేజిస్, ఈగల్ వంటి చిత్రాల్లో నటించారు.
మధ్యలో తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలను ఒక చూపు చూసిన అనుపమ పరమేశ్వరన్.. టిల్లూ స్క్వేర్ ద్వారా తెలుగులో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే అనుపమ.. ఇందులో కాస్త బోల్డ్‌గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనుపమ పరమేశ్వరన్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే అనుపమ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పరదా అనే తెలుగు చిత్రంతో పాటు మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.
టిల్లూ స్క్వేర్‌లో ఆమె నటన చూసిన అభిమానులు షాకయ్యారు. ఇకపై అలాంటి క్యారెక్టర్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. కానీ ఈమె మాత్రం ఎలాంటి రోల్స్ అయినా తాను చేయగలనని చెప్పుపొచ్చారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే అనుపమ పరమేశ్వరన్.. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, వ్యక్తిగత వివరాలకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ట్రెండింగ్‌లో ఉంటారు.
తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. షర్ట్‌ని నడుం దాకా ముడివేసి, కింద ప్యాంట్ వేసిన అనుపమ.. అహ్ అహ్ అహ్ దొంగిలించబడిన ప్యాంట్ , షర్ట్‌తో బతికేస్తున్నానని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అనుపమ ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టినట్లు అంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











