అప్పట్లో కడుపుతో ఉన్న ఫొటోను షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. బ్యూటీఫుల్ ఫొటో అంటూ..
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకుంటున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ అయితే అందుతున్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధంలేకుండా అవకాశాలు అందుకుంటున్న అనుపమ ఇటీవల రౌడి బాయ్స్ లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా అనుపమ అప్పుడప్పుడు ఆశ్చర్యపరిచే ఫోటోలను కూడా పోస్ట్ చేస్తోంది. రీసెంట్గా ఆమె గర్భవతిగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ఒక్క క్షణం అందరికీ నిజం అనుకునేలా చేసింది.. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే మంచి సక్సెస్
మలయాళం చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ మొదటి సినిమాతోనే బిగ్ సక్సెస్ అందుకుంది. ఇక ఆ తరువాత చాలా తొందరగానే ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు కూడా వచ్చాయి. త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన అఆ సినిమాలో ఒక పొగరున్న పల్లెటూరి అమ్మాయిల కనిపించింది. ఆ తరువాత తెలుగు ప్రేమమ్ రీమేక్ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ సినిమా నుంచి..
ఆమె అదృష్టం ఏమిటో కానీ మొదట్లో చేసిన సినిమాలు అన్నీ కూడా చాలా మంచి విజయాన్ని అందుకున్నాయి. శర్వానంద్ తో చేసిన శతమానం భవతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఆ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలందరితోను ఆమె హీరోయిన్ గా మంచి అవకాశాలను అందుకుంది.

మొదటి లిప్ లాక్ సీన్..
ఇక మధ్య మధ్యలో కొన్ని సినిమాలు అనుపమ పరమేశ్వరన్ ను తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ ఆ తరువాత రాక్షసుడు సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. ఇక రీసెంట్ గా రౌడీ బాయ్స్ సినిమా లో అయితే అనుపమ పరమేశ్వరన్ మొదటి సారి బార్డర్ దాటేసి నటించినట్లు గా అర్థమైంది. ఏకంగా మొదటిసారి ఆమె లిప్ లాక్ సన్నివేశం లో చాలా ఘాటుగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

భారీ రెమ్యునరేషన్..
దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఆమె రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగానే పెంచేసింది. అంతేకాకుండా పారితోషికం కూడా భారీ స్థాయిలో తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కెరీర్లోనే అత్యధికంగా కోటిన్నరకు పైగా నే ఆ సినిమా కోసం పారితోషకం అందుకున్నట్లు టాక్ అయితే వచ్చింది.

కడుపుతో కనిపించిన అనుపమ
ఇక రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ కడుపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఫోటో కూడా చాలా నేచురల్ గా నిజం అనేలా ఉంది. ఇక ఆమె పక్కనే మరొక వ్యక్తి కూడా ఆప్యాయంగా పట్టుకుని ఉండడం ఆశ్చర్యపరిచింది. ఆ వ్యక్తి మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్ తండ్రి పరమేశ్వరన్.
Recommended Video

ఆ సినిమాలోని క్యారెక్టర్..
ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ కింద మరో క్యాప్షన్ ఇవ్వడంతో అది ఒక సినిమాలోని ప్రత్యేకమైన క్యారెక్టర్ ఫోటో అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. 2020 లో వచ్చిన 'మనియారాయిలే అశోకన్' అనే మలయాళం సినిమాలో అనుపమ ఈ విధంగా ప్రెగ్నెంట్ ఉన్న పాత్రలో నటించింది. ఇక నాన్నతో బ్యూటీఫుల్ పిక్చర్ అంటూ అనుపమ ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


Click it and Unblock the Notifications











