Just In
- 40 min ago
ముద్దు పెట్టలేదని వదిలేసింది.. పెళ్లి కంటే ముందే ఒక లవ్ స్టొరీ.. బ్రేకప్ గురించి చెప్పిన స్టార్ హీరో
- 1 hr ago
బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం: యంగ్ సింగర్‌తో అలా.. అందరి ముందే ప్రామిస్ చేయడంతో!
- 1 hr ago
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్: అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చిన రెబెల్ స్టార్
- 2 hrs ago
ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: అసలు విషయం లీక్ చేసిన అఖిల్.. మోనాల్ పరిస్థితేంటి మరి?
Don't Miss!
- News
అతి త్వరలో విశాఖకు రాజధాని- సమాంతరంగా మరో సిటీ-ఐకానిక్ బ్రిడ్జ్-మంత్రుల క్లారిటీ
- Automobiles
భారత్‌లో కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి లాంచ్; పూర్తి వివరాలు
- Finance
బ్యాంక్రప్టసీ: కేంద్రం ఆ సవరణలకు సుప్రీం కోర్టు సమర్థన
- Sports
ISL 2020 21: బెంగళూరు చిత్తు.. కేరళ బ్లాస్టర్స్ ఖాతాలో మరో విజయం!!
- Lifestyle
గురువారం దినఫలాలు : సింహరాశి వారు ఈరోజు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ సారి మరింత క్రియేటివిటీ వాడండి.. ఫేక్ న్యూస్‌పై అనుపమ సెటైర్స్
అనుపమా పరమేశ్వరణ్.. కేరళ అందమైనా సరే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. మలయాళి ప్రేమమ్ సినిమాతో యూత్‌ను కట్టిపడేసిన అనుపమ రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించింది. సంప్రదాయమైన దుస్తులు ధరిస్తూ.. హోమ్లీ రోల్స్ చేస్తూ కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ ముద్దుగుమ్మకు సరైన కమర్షియల్ హిట్ పడకపోవడం కాసింత బాధాకరమైన విషయమే. అయినా కానీ అనుపమకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
ఒకప్పుడు డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి యాప్‌లో అనుపమా వీడియోలు చేస్తూ హల్చల్ చేసేది. యూట్యూబ్‌లో అనుపమై డబ్ స్మాష్ వీడియోలు లెక్కలేనన్ని ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో అనుపమకు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమకు తాజాగా డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి పడ్డారు. ఏడు మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో అనుపమా ఆనందంలో తేలిపోయింది. ఈ మేరకు తన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఇలాగే తనకు సపోర్ట్ చేస్తూ ఉండండని ఐ లవ్యూ అని చెప్పి ఓ ముద్దు కూడా విసిరింది.

తాజాగా అనుపమా ఓ వెబ్ సైట్‌కు కౌంటర్ వేసింది. తన మీద తప్పుడు వార్తలు రాయడంతో సెటైర్స్ వేసింది. అనుపమ పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు రాసిన వెబ్ సైట్‌పై పంచులు వేసింది. ఆ వెబ్ సైట్ రాసిన వార్తలో సౌండ్ బాగానే ఉన్నా.. వేరే వాళ్లు కాపీ చేసేందుకు ఈజీగా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తుంటారు. వావ్.. ఈసారి మరింత క్రియేటివిటీని వాడండ'ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనుపమా ఓ మళయాలి చిత్రానికి అసిస్టెంట్‌గానూ వర్క్ చేస్తోంది. తెలుగులోనూ కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.