సిగ్గు విడిచిన అనుపమ పరమేశ్వరన్.. అందరి సాక్షిగా అతడికి ప్రేమ సందేశం పంపేసింది.!

Recommended Video

nupama Parameswaran Posts Love Message In Her Instagram || Filmibeat Telugu

'ప్రేమమ్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత 'అ ఆ'తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అందానికి తోడు అభినయం ఉన్న నటి కావడంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనుపమ అంటే దక్షిణాదికి చెందిన హీరోయిన్ మాత్రమే అనుకుంటే పొరపాటే.. ఆమె దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. దీనికి కారణం లవ్ ఎఫైరే. తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా మేటర్..?

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని వేదికగా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటు సినిమా సంబంధిత వివరాలను వెల్లడిస్తుంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒకరి విషయంలో ఆమె చేసిన పని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

సోషల్ మీడియాలో ఫాలో అవడంతో...

కొంత కాలంగా అనుపమ పరమేశ్వరన్ టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బూమ్రాతో లవ్ ట్రాక్ నడుపుతుందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీనికి కారణం బూమ్రా.. అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో ఒకరినొకరు ఫాలో కావడంతో పాటు.. ఒకరి పోస్ట్‌లను ఒకరు షేర్ చేసుకుని లైక్స్ చేస్తుండడమే. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందంటూ ప్రచారం ఊపందుకుంది.

హీరోయిన్‌లా కంటే అలా ఫేమస్

అనుపమ అంటే దక్షిణాదికి చెందిన గ్లామరస్ హీరోయిన్ అని అందరికీ తెలుసు. అయితే, కొద్దిరోజుల క్రితం ఆమె.. టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమలో పడిందంటూ వచ్చిన వార్తలతో ఆమె హైలైట్ అయింది. అందరూ అనుపమ పరమేశ్వరన్ ఎవరు అని గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ కారణంగానే ఆమె హాట్ టాపిక్ అయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది

ఈ వార్తలు దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుండడంతో అనపమ పరమేశ్వరన్ చాలా సార్లు స్పందించింది. ఒకానొక సందర్భంలో సీరియస్ కూడా అయింది. ఇక, ఇటీవల జరిగిన ‘రాక్షసుడు' ప్రమోషన్‌లో కూడా ఆమెకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తారో అర్ధం కాదు. బూమ్రా నాకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.

ఇప్పుడేమో ప్రేమ సందేశం పంపింది

తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆరు పోస్టులు పెట్టింది. వీటిలో ఒక్కో పదం ఒక్కో పోస్టులో రాసుకొచ్చింది. మొత్తంగా ‘ఈ అందమైన ప్రపంచంలో నువ్వు నేను మాత్రమే' అని అర్థం వచ్చేలా చేసింది. దీంతో ఆమె ప్రేమ సందేశం పంపించేసిందని అంటున్నారు. ఇక, ఆమె పోస్టుల కింద ప్రతి ఒక్కరూ ‘బూమ్రా' అని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో అనుపమ తన ప్రేమను బహిరంగం చేయాలనుకుంటోందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X